అమెజాన్‌లో ఆకట్టుకుంటోన్న ఆది సాయి కుమార్ 'టాప్ గేర్'

Related image

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో టాప్ గేర్ అంటూ ఆది సాయి కుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది చేసిన యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్ సీన్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు టాప్ గేర్ సినిమా దూసుకుపోతోంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న టాప్ గేర్.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన రియా సుమన్ జంటగా నటించింది.

ఈ సినిమాతో శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా కథను నడిపించాడు. టాప్ గేర్ సినిమాను కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మంచారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌గా నిలిచింది. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన పాటలు, ఆర్ఆర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.  

More Press Releases