రీబాక్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా తాప్సీ పన్ను మరియు సూర్యకుమార్ యాదవ్‌లను ప్రకటించింది

Related image

Hyderabad, మే 08, 2023 క్రీడలు మరియు ఫిట్ నెస్ కు మారుపేరుగా నిలిచిన రీబక్, తమ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రకటించింది. భారతదేశంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రీటైల్ లిమిటెడ్ (ఏబీఎఫ్ఆర్ఎల్) ఆధ్వర్యంలో, ప్రేక్షకులతో లోతుగా అన్వయించబడే శక్తివంతమైన కొత్త కాంపైన్ కోసం బ్రాండ్ అంబాసిడర్స్ గా ప్రముఖ నటి తాప్సీ పన్ను మరియు ప్రపంచ నంబర్ టి 20 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ లతో అనుసంధానమైన రీబక్ తనను తాను ప్రముఖ క్రీడలు మరియు పెర్ఫార్మెన్స్ బ్రాండ్ గా పునః స్థాపించుకుంటోంది.

 

ఐ యామ్ న్యూ పేరుతో గల కాంపైన్, ఇద్దరు అసాధారణమైన వ్యక్తులను చూపిస్తుంది. మూస రకాలను దూరం చేసి తమ కోసం కొత్త నియమాలు సృష్టించిన - ప్రపంచపు నంబర్ 1 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరియు ప్రముఖ నటి తాప్సీ పన్ను. సవాల్లను అధిగమించడంలో వారిని ప్రేరేపించే గాథలు మరియు తమ సొంత మార్గాలను రూపొందించుకోవడం కాంపైన్ యొక్క కీలకమైన సందేశానికి ప్రతిరూపంగా నిలుస్తుంది - మీ యొక్క సంప్రదాయేతర స్ఫూర్తిని అనుసరించండి మరియు మీ సొంత ట్రయల్ సృష్టించండి.

 

క్రీడలు మరియు ఫిట్ నెస్ లను ప్రేమించడం భారతదేశపు సంస్క్రతిలో అంతర్భాగం. క్రీడలు అనేవి జాతి యొక్క హృదయ స్పందన, లక్షలాది ప్రజలు చురుకుగా పాల్గొని మీడియా అంతటా వివిధ రకాల క్రీడలను అనుసరిస్తున్నారు. దేశంలో ప్రీమియర్ క్రీడలు మరియు పెర్ఫార్మెన్స్ బ్రాండ్ గా రీబక్ తన వారసత్వాన్ని వెల్లడించడం, ఫిట్ నెస్ ను తమ జీవన విధానంగా ప్రతి ఒక్కరు అనుసరించాలని ప్రోత్సహించడం కేవలం సహజం. ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, ఐ యామ్ ది న్యూ కాంపైన్ అనేది మూస రకాలకు మిగిలిపోయిన లేదా తాము యోగ్యులం కాదని భావించే  ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక ఉద్వేగభరితమైన పిలుపు. పరిమితుల శృంఖలాలు నుండి స్వేచ్ఛగా విడుదలై తమ నిజమైన సామర్థ్యాన్ని అనుసరించాలని భారతదేశపు యువత కోసం ఇది ఒక ర్యాలీ.

 

ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ. మనోజ్ జునేజా, ఛీఫ్ ఆపరేటింగ్ అధికారి, రీబక్, ఇండియా, ఇలా అన్నారు “క్రీడలు మరియు ఫిట్ నెస్ యొక్క ప్రపంచం అభిప్రాయాన్ని మార్చడంలో రీబక్ కీలకమైన బాధ్యతవహిస్తుంది మరియు ఆ ప్రతిష్టను బలోపేత్తం చేయడం గురించి మరియు మన స్థానాన్ని ఎగువ స్థానంలో ఉంచడమే ఈ కాంపైన్ ఉద్దేశ్యం. మా కొత్త బ్రాండ్ అంబాడిసడర్స్, క్రీడలు ద్వారా మా సాధికారత మరియు స్వీయ-వ్యక్తీకరణ యొక్క మా సందేశానికి ప్రతిరూపంగా నిలుస్తారు. వారి సహాయంతో, మేము భారతదేశపు యువతతో మా సంబంధాన్ని విస్త్రతంగా చేసుకోవడానికి మరియు మా బ్రాండ్ యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్వేగంగా ఉన్నాము. ‘ ఐ యామ్ ద న్యూ’ కేవలం కాంపైన్ కంటే ఎక్కువే; క్రీడలను మన జీవితంలో ఒక అంతర్భాగం చేయడానికి మరియు మనంచేసే ప్రతి పనిలో గొప్పదనం కోసం కృషి చేయడానికి ఇది ఒక పిలుపుగా భావించాలి.”

 

రీబక్ తో ఆయనకు గల సంబంధం పై, క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఇలా అన్నారు, “నేను రీబక్ తో భాగస్వామిగా ఉండటానికి ఉద్వేగంగా ఉన్నారు, క్రీడలు మరియు ఫిట్ నెస్ నా అభిప్రాయాన్ని ప్రతిబింబించే బ్రాండ్. ఒక వ్యక్తి సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఉత్తమంగా అభివృద్ధి చెందుతాడు. రీబక్ కొత్త కాంపైన్ ఆట పై నా సంప్రదాయేతర విధానాన్ని పరిపూర్ణంగా వర్ణిస్తుంది. ఉత్సాహపు వెల్లువను ప్రేరేపించడానికి మరియు దేశపు యువతలో ‘ఐయామ్ ద న్యూ’ సిద్ధాంతాన్ని వెలిగించడానికి నేను ఎదురుచూస్తున్నాను.”

 

రీబక్ తో ఈ సంబంధం గురించి ఆమె తన ఉద్వేగాన్ని తెలియచేస్తూ, నటి తాప్సీ పన్ను ఇలా వ్యాఖ్యానించారు,”మీ హద్దులను ముఖ్యంగా మీ స్వీయ వ్యక్తిత్వాన్ని  ప్రోత్సహించేలా వీలు కల్పించే రీబక్ వంటి బ్రాండ్ తో సంబంధాన్ని కలిగి ఉండటం ఎంతో ఉద్వేగంగా ఉంది. సాధారణంగా అందర్నీ అనుసరించడం చాలా సులభం కానీ మీ సొంత మార్గాన్ని తయారు చేసుకోవడానికి ఎంతో సాహసం కావాలి.  రీబక్ కొత్త కాంపైన్ నిజంగా ఈ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తుంది. ‘ఐ యామ్ ది న్యూ’ కాంపైన్  అడ్డంకులను అధిగమించడంలో మా భాగస్వామ్య నమ్మకాన్ని పరిపూర్ణంగా వర్ణిస్తుంది మరియు నిజ జీవితంలోనైనా, సినిమాలలోనైనా మీ సొంత విలక్షణమైన గుర్తింపును సృష్టిస్తుంది. ఈ ఉద్యమంలో భాగంగా ఉండటానికి నేను గర్విస్తున్నాను, బ్రాండ్ తో అద్భుతమైన ప్రయాణం కోసం నేను ఎదురుచూస్తున్నాను.”

     

రీబక్ మరియు ఏబీఎఫ్ఆర్ఎల్ లు తమ ప్రయాణంలో ఈ కొత్త అధ్యాయాన్ని ఆరంభించడంతో, రాబోయే మాసాల్లో ఉత్తేజభరితమైన సహకారాల సమూహం రానుంది, ‘ఐ యామ్ ద న్యూ’ కాంపైన్  భారతదేశం వ్యాప్తంగా యువత చర్య తీసుకోవడానికి ఒక శక్తివంతమైన మరియు ఉద్వేగభరితమైన పిలుపుకు ప్రాతినిధ్యంవహిస్తుంది. పరిమితుల సంకెళ్లు తెంచుకుని, మీ వ్యక్తిత్వం యొక్క ఉత్తమమైన వెర్షన్ గా మారడానికి ఇది సమయం.

 

రీబక్ గురించి

రీబక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు బోస్టన్, ఎంఎ, యుఎస్ఏలో ప్రధాన కార్యాలయం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన  క్రీడలు, ఫిట్ నెస్ మరియు జీవనశైలి ఫుట్ వేర్, దుస్తులు మరియు సామగ్రి యొక్క డిజైనర్, మార్కెటర్ మరియు డిస్ట్రిబ్యూటర్. రీబక్ ఆథంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) భాగం. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ (ఏబీఎఫ్ఆర్ఎల్) భారతదేశంలో ఆపరేటింగ్ భాగస్వామిగా ఉంది. అమెరికన్ - ప్రేరేపిత అంతర్జాతీయ బ్రాండ్ గా, రీబక్  గొప్ప మరియు  క్రీడా గాథలు & ఫిట్ నెస్ వారసత్వంతో  క్రీడా వస్తువుల పరిశ్రమలో మార్గదర్సకత్వంవహిస్తుంది.

 

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రీటైల్ లిమిటెడ్ గురించి

 

ఏబీఎఫ్ఆర్ఎల్ ప్రముఖఖ భారతదేపు మిశ్రమం, ద ఆదిత్యా బిర్లా గ్రూప్ లో ఒక భాగం. రూ. 8,136 కోట్ల ఆదాయంతో, 9.2 మిలియన్ చదరపు అడుగుల (మార్చి 31, 2022 నాటికి) రీటైల్ స్థలంలో విస్తరించి, ఇది భారతదేశపు మొదటి బిలియన్-డాలర్ -ప్యూర్ ప్లే ఫ్యాషన్ పవర్ హౌస్ గా, సొగసైన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ మరియు రీటైల్ రూపాల గుచ్ఛంగా ఉంది.  

కంపెనీకి భారతదేశంవ్యాప్తంగా డిపార్ట్ మెంట్ స్టోర్స్ లో 3,468 స్టోర్స్ నెట్ వర్క్ గలదు, సుమారు 28,585 మల్టి-బ్రాండ్ అవుట్ లెట్స్, 6,515 పాయింట్ ఆఫ్ సేల్స్ గలవు (31 మార్చి 2022 నాటికి).

లూయీ ఫిలిప్పీ, వ్యాన్ హుసేన్, అలెన్ సోల్లి మరియు పీటర్ ఇంగ్లండ్ వంటి 25 సంవత్సరాలకు పైగా స్థాపించబడిన భారతదేశపు అతి పెద్ద బ్రాండ్స్ యొక్క సమూహాన్ని కూడా ఇది కలిగి ఉంది. పాంటలూన్స్ భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ రీటైలర్స్ లో ఒకటిగా ఉంది.

ఏబీఎఫ్ఆర్ఎల్ వారి అంతర్జాతీయ బ్రాండ్స్ పోర్ట్ ఫోలియోలో - ద కలక్టివ్, అంతర్జాతీయ బ్రాండ్స్ యొక్క భారతదేశపు అతి పెద్ద మల్టి-బ్రాండ్ రీటైలర్ భాగంగా ఉంది మరియు ఎంపిక చేయబడిన బ్రాండ్స్ యైన రాల్ఫ్ లారెన్, హకెట్ లండన్, సిమన్ కార్టర్, టెడ్ బేకర్, ఫ్రెడ్ పెర్రీ, ఫర్ ఎవ్వర్ 21, అమెరికన్ ఈగల్ మరియు రీబక్ వంటి ఎంపిక చేయబడిన బ్రాండ్స్ తో దీర్ఘకాలంగా ప్రత్యేకమైన భాగస్వామ్యాలను కూడా కలిగి ఉంది.

వ్యాన్ హ్యుసేన్ ఇన్నర్ వేర్, అథ్లీజర్ మరియు యాక్టివ్ వేర్ భారతదేశపు అత్యంత కొత్త మరియు ఫ్యాషనబుల్ బ్రాండ్ గా తమను తాము స్థిరపరచుకుంటోంది. బ్రాండెడ్ ఎథ్నిక్ వేర్ వ్యాపారంలోకి కంపెనీ వేసిన అడుగులో జేపోర్, తస్వా మరియు మేరీగోల్డ్ లేన్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. కంపెనీకి డిజైనర్స్ ‘శంతను & నిఖిల్’, ‘తరుణ్ తహిలియాన’, ‘సవ్యసాచి' మరియు ‘హౌస్ ఆఫ్ మసాబా' లతో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాలు ఉన్నాయి. ఫ్యాషన్, అందం మరియు ఇతర జీవన శైలి విభాగాలలో ఆధునిక బ్రాండ్స్ యొక్క పోర్ట్ ఫోలియోను నిర్మించడానికి ఏబీఎఫ్ఆర్ఎల్ గణనీయమైన డైరక్ట్-టు-కంజ్యూమర్ బాధ్యతను కూడా వహిస్తోంది.

లీనమయ్యే కస్టమర్ అనుభవం ఇవ్వడానికి, తమ బ్రాండ్స్ తో వినియోగదారుతో విస్త్రతంగా సంబందం కలిగి ఉండటానికి మరియు అభివృద్ధి చెందుతున్న వినియోగదారు శ్రేణుల్లోకి తమ పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి డిజిటల్ ఆస్థులు యొక్క సమీకృత పోర్ట్ ఫోలియో నిర్మించడానికి తమ brands.comను పెంచడం ద్వారా కంపెనీ తమ డిజిటల్ సామర్థ్యాలను శక్తివంతం చేస్తోంది.

మరింత సమాచారం కోసం,దయచేసి సంప్రదించండి : జానెట్ అరోలే, ఏవీపీ & హెడ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన అండ్ రీటైల్ లిమిటెడ్ 
 


More Press Releases