ర‌వీంద్ర‌భార‌తిలో 4న స్వాగ‌త స‌భ

Related image

* అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు, స‌చివాల‌య నామ‌క‌ర‌ణ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు అభినంద‌న‌, ధ‌న్య‌వాదాలు

 * ముఖ్య అతిథిగా యూజీసీ మాజీ ఛైర్మన్ ప్రొఫసర్ సుఖ్ దేవ్ థోరట్

 * సభలో పాల్గొంటున్న అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లు

 * తెలంగాణ పౌర సమాజం తరఫున ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ ఆహ్వానం

 హైద‌రాబాద్‌, ఏప్రిల్ 1, 2023: తెలంగాణ స‌చివాల‌యానికి డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ పేరు పెట్ట‌డం, ఆ మ‌హ‌నీయుడి భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటుచేస్తున్న సంద‌ర్భంగా ఒక స్వాగ‌త స‌భ‌ను న‌గ‌రంలోని రవీంద్ర‌భార‌తిలో ఈ నెల నాలుగోతేదీ మంగ‌ళ‌వారం నిర్వ‌హిస్తున్నారు. ఆరోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానంగా దేశంలోనే ఎక్క‌డా లేనంత ఎత్తులో.. ఏకంగా 125 అడుగుల స్థాయిలో అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు, దేశంలో ఏ ప‌రిపాల‌నా భ‌వ‌నానికీ లేన‌ట్లుగా తెలంగాణ స‌చివాల‌యానికి బాబాసాహెబ్ పేరు పెడుతున్నందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల్సిందిగా విద్యార్థి, యువ‌జ‌న‌, ఉద్యోగ‌, మేధావి, స‌మ‌స్త జ‌నుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు గ్రామోద‌య ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ టెక్నాల‌జీ వ్య‌వ‌స్థాప‌కుడు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఢిల్లీ వ‌సంత్ తెలిపారు. ఏషియ‌న్ టైగ‌ర్స్‌గా పిల‌వ‌బ‌డే నేటి దేశాల అభివృద్ధి ప్ర‌ణాళిక‌లకు అంబేడ్క‌ర్ ఆలోచ‌న‌లే కార‌ణ‌మ‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి నిర్ణ‌యంతో ప్ర‌పంచం దృష్టికి అంబేడ్క‌ర్ ఒక ఆర్థిక వేత్త‌గా తెలియ‌జేసిన‌ట్లు చెప్పారు. 4వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు స‌మ‌తా సైనిక్ ద‌ళ్ ఆధ్వ‌ర్యంలో అంబేడ్క‌ర్ 125 అడుగుల‌ ప్ర‌తిమ‌కు సెల్యూట్ ఉంటుంద‌ని, స‌భ‌కు వ‌చ్చిన‌వారంతా సిగ్నేచ‌ర్ బ్యాన‌ర్‌పై సంత‌కాలు పెట్టాల‌ని ఆయ‌న తెలిపారు. ఈ బ్యాన‌ర్‌ను విగ్ర‌హావిష్క‌ర‌ణ రోజు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు, ఆ త‌ర్వాత కూడా భ‌ద్ర‌ప‌రుస్తార‌ని ప్ర‌బుద్ధ భార‌త్ ఇంట‌ర్నేష‌న‌ల్ రాష్ట్ర అధ్యక్షుడు బి. శ్యామ్ తెలిపారు.

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ తదితర సంఘాలతో ఆహ్వాన కమిటీ రూపొందింది. దీనికి కన్వీనర్లుగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ తెలంగాణ అధ్యక్షుడు బి.శ్యామ్, సమతా సైనిక్ దళ్ జాతీయ ఉపాధ్యక్షుడు దాసరి శ్యామ్ మనోహర్, ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రమణా నాయక్, కో-కన్వీనర్లుగా సమతా సైనిక్ దళ్ దక్షిణభారత ప్రధాన కార్యదర్శి రవీందర్ బౌద్ధనాగ, ఇంకా మామిడి నారాయణ, టి.ఎన్.ప్రవీణ్ కుమార్, పరమేశ్ మూల, శ్రీరాం ఆనంద్, మీసాల అరుణ్ కుమార్, మాందాల భాస్క‌ర్ వ్యవహరిస్తారు.

ఈ కార్యక్రమంలో యూజీసీ మాజీ ఛైర్మన్ ప్రొఫసర్ సుఖ్ దేవ్ థోరట్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. గౌరవ అతిథులుగా తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ సీఎస్‌ కాకి మాధవరారవు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, డిక్కి జాతీయాధ్యక్షుడు, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు నర్రా రవికుమార్, టీఎస్‌పీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, బుద్ధవనం ప్రాజెక్టు స్పెష‌ల్ ఆఫీస‌ర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్సీ, ఎస్టీ నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి ఆరేపల్లి రాజేందర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి మల్లయ్య భట్టు, ఐఎంఏ మాజీ ఛైర్మన్ డాక్టర్ బి.ప్రతాపరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.అశోక్ పాల్గొంటారు.

      అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫసర్ డి.రవీందర్ యాదవ్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ టి.రమేష్, జేఎన్ టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ మల్లేష్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ విజ్జులత, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు పాల్గొంటారు. 

More Press Releases