హైద‌రాబాద్ చాప్ట‌ర్‌ను ప్రారంభించిన కార్పొరేట్ క‌నెక్ష‌న్స్

Related image

* ముఖ్య అతిథిగా హాజ‌రైన టి-హ‌బ్ సీఈవో మ‌హంకాళి శ్రీ‌నివాస‌రావు
 
హైద‌రాబాద్, మార్చి 26, 2023: కార్పొరేట్ క‌నెక్ష‌న్స్ సంస్థ (సీసీ హైద‌రాబాద్‌-1) హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌న మొట్ట‌మొద‌టి చాప్ట‌ర్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ కనెక్షన్స్ (సిసి) అనేది గ్లోబల్ బిజినెస్ నెట్‌వర్కింగ్ సంస్థ‌. ప్రపంచవ్యాప్తంగా నాయకులను కనెక్ట్ చేయడం, వారి సంస్థలు, కమ్యూనిటీలు, జీవితాల్లో అవకాశాలను, అర్థవంతమైన మార్పును సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సీసీ ప్రస్తుతం 5 ఖండాలు, 24 దేశాలు, భార‌త‌దేశంలోని 25 నగరాల్లో చురుగ్గా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది.  “నాయకులు కనెక్ట్ అయ్యే వేదిక‌” అనేది సీసీ ట్యాగ్‌లైన్. “కనెక్షన్లు చేయడం ముఖ్యం” అనేది దాని థీమ్‌.
 
కార్పొరేట్ ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంయుక్తంగా పాల్గొని జ్యోతి వెలిగించారు. ముఖ్య అతిథి, టి-హబ్ హైదరాబాద్ సీఈవో మ‌హంకాళి శ్రీ‌నివాస‌రావు  మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, ఆసక్తులతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా టి-హబ్ హైదరాబాద్ న‌గ‌రానికి స‌రికొత్త చార్మినార్ అయ్యింది. ప్రపంచానికి టీకాల రాజధాని అయిన హైదరాబాద్.. మహమ్మారి సమయంలో అవసరమైన వారికి సేవలు అందించి తనను తాను నిరూపించుకుంది. ఇక్క‌డి అద్భుతమైన వాతావరణం, ఆత్మీయంగా ఉండే ప్ర‌జ‌ల కార‌ణంగా బెంగ‌ళూరును సైతం దాదాపు ఓడించేలా అత్యుత్త‌మ గమ్యస్థానంగా మారింది. హైదరాబాద్‌కు ఐటీ కార్పొరేట్లు మారే గ‌ణ‌నీయ‌మైన మార్పును నేను గమనించాను” అన్నారు.

       ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కార్పొరేట్ క‌నెక్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ నీహార్ ఏరుబండి మాట్లాడుతూ, “హైద‌రాబాద్ లాంటి చారిత్ర‌క న‌గ‌రంలో చ‌రిత్ర సృష్టించిన‌ క్ష‌ణాలివి. హైద‌రాబాద్‌లో ఒక మంచి వ్యాపార ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, బోలెడ‌న్ని స్టార్ట‌ప్‌లు ఉన్నందున ఇది ప‌ర‌స్ప‌ర ఎదుగుద‌ల‌కు అవ‌కాశ‌మున్న క‌మ్యూనిటీ” అని చెప్పారు.

కార్పొరేట్ క‌నెక్ష‌న్స్ జాతీయ డైరెక్ట‌ర్ కేవీటీ ర‌మేష్ మాట్లాడుతూ, “మౌలిక విలువ‌లు ఉన్న నాయ‌కుల‌తో క‌నెక్ట్ అయ్యి, వారు మ‌రింత‌గా రాణించేందుకు సాధికారం చేయాలి. మార్పు కోసం ఒక ఉత్ప్రేర‌కంగా రాణించ‌డానికి, ప్ర‌తి రంగంలోనూ అభివృద్ధి చెందడానికి వారిని శ‌క్తిమంతం చేయాలి” అని సూచించారు.
 
సంస్థ చాప్ట‌ర్ ఛైర్ మీర్ అహ్మ‌ద్ అలీఖాన్ మాట్లాడుతూ, “కేవలం నెట్ వర్కింగ్ కారణంగానే మార్పు జరుగుతుంది.  ఎలాంటి వ్యాపారాన్నైనా ముందుకు తీసుకెళ్ల‌డానికి సీసీ సరైన పూల్. మీవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే కాకుండా,  విస్తృతమైన పరిశోధన ద్వారా రూపొందించిన ఉత్ప‌త్తుల‌ని మేం నిర్ధారిస్తాం” అని చెప్పారు.

      అంత‌కుముందు కార్పొరేట్ క‌నెక్ష‌న్స్ సీనియ‌ర్ అధికారులు పిన్నింగ్ కార్యక్రమం ద్వారా కొత్త సభ్యులను చేర్చుకున్నారు. వివిధ దేశాల నుంచి స్వాగ‌తిస్తూ వ‌చ్చిన వీడియో సందేశాల‌ను స్క్రీన్ మీద ప్ర‌ద‌ర్శించారు. అదే స‌మ‌యంలో వారి ప్ర‌యాణం, అనుభవపూర్వక భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. లైవ్ సూఫీ బృందం ఆలపించిన సంగీతం, పాటలు, అక్క‌డ అందించిన మంచి ఆహారం.. పాల్గొన్న‌వారంద‌రినీ అల‌రించాయి. సీసీ హైద‌రాబాద్‌కు నిహార్ ఏరుబండి, అనంత్ చైత‌న్య బ‌దే, అజ‌య్ మంచుకొండ ఫ్రాంచైజీ య‌జ‌మానులుగా  ఉన్నారు.

More Press Releases