తెలుగు సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లు డాలస్ లో బాపూజీ కి ఘన నివాళి

Related image

డాలస్, టెక్సాస్: శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ సినీనిర్మాణ సంస్థతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించి, తిరుగులేని నిర్మాతగా పేరుగాంచిన సినీ నిర్మాత చలసాని అశ్వినీదత్, పారిశ్రామిక వేత్త, కాకినాడ సీపోర్ట్ ఛైర్మన్ కె. వి. రావు గార్లు శుక్రవారం డాలస్ లో నెలకొనిఉన్న అమెరికాదేశం లోనే అతి పెద్దదైన “మహాత్మాగాంధీ స్మారకస్థలిని” దర్శించి బాపూజీకి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
మన ప్రవాసాంధ్రులు భారతదేశ పేరు ప్రతిష్టలను పరదేశంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు అని చెప్పడానికి ఈ మహాత్మాగాంధీ స్మారకం ఒక ఉదాహరణ అని, ఇంతటి ఘనతను సాధించిన మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల. బోర్డు సభ్యులు మురళీ వెన్నం తదితర కార్యవర్గ సభ్యులులను, జీవం ఉట్టిపడేటట్లు శిల్పాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ ను, సహకరించిన ఇర్వింగ్ పట్టణ ప్రభుత్వ అధికారులను వీరు ముగ్గురూ అభినందించారు.
ఎన్నో కార్యక్రమాలతో సతమవుతూ కూడా తీరిక చేసుకుని ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించడానికి వచ్చినందులకు కె. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కె. వి. రావు గార్లకు డా. ప్రసాద్ తోటకూర తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అందరికీ గాంధీజీ జ్ఞాపికలను బహుకరించారు.
తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, సురభి రేడియో అధినేత్రి రాజేశ్వరి ఉదయగిరి, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సుదీర్ చింతమనేని, సుధాకర్ ప్రబృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Press Releases