ఫొటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి 25న అమీర్ పేట గ్రీన్ పార్క్ హోటల్ లో బహుమతులు: అర్వింద్ కుమార్

Related image

  • ఫొటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి 25న అమీర్ పేట గ్రీన్ పార్క్ హోటల్ లో బహుమతులు, నగదు పురష్కారం- సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, అర్వింద్ కుమార్
హైదరాబాద్: 23 ఆగస్టు,2022: ఆగస్టు 19 తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 5 కేటగిరిలలో నిర్వహించిన *ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలకు ఈ నెల 25న అమీర్ పేట గ్రీన్ లాండ్స్ లోని  గ్రీన్ పార్క్ హోటల్ లో ఉదయం 9 గంటలకు బహుమతులు, నగదు పురష్కారాలు అందించనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీలలో 96 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారని, పోటీలకు అందిన 1,200 ఫోటోలను జ్యూరి సభ్యులు పరిశీలించి ప్రతి కేటగిరినుంచి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు, ఐదు కన్స్ లేషన్ బహుమతులు చొప్పున మొత్తం 40 బహుమతులు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు ఫోటోగ్రఫీ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరు అవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం గౌరవ అధితులుగా పాల్గొంటున్నారు.

ఫోటోగ్రఫీ పోటీల బహుమతి గ్రహీతలందరికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఎంపిక అయిన ఫొటోగ్రాఫర్లు అందరూ నేరుగా ఈ నెల 25వ తేదీన ఉదయం 9-00 గంటలకు అమీర్ పేట లోని గ్రీన్ పార్క్ హోటల్ కు రావాలని కోరారు. ఈ బహుమతి ప్రధానోత్సవం సందర్బంగా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

More Press Releases