వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Related image

  • ప్రభుత్వం గుర్తించిన వీధివ్యాపారుల సంఖ్య: :6,08,277.
  • రూ.10,000/- చొప్పున మొదటివిడత రుణాలు పొందిన వీధివ్యాపారుల సంఖ్య: 3,55,250
  • గడువుకంటే ముందుగానే మొదటి విడత రుణాలను తిరిగి చెల్లించిన వీధి వ్యాపారులు సంఖ్య :1,91,351
  • *రెగ్యులర్ రీపేమెంట్స్ వలన పొందిన వడ్డీ రాయితీ:రూ8కోట్ల 22 లక్షలు..
  • రూ.20,000/-చొప్పున రెండవవిడత రుణాలు పొందిన వీధివ్యాపారులు సంఖ్య :97,718
హైదరాబాద్:11 ఆగస్టు,2022: ప్రజలకు నిత్యావసరాల వస్తువులు, ఆహార పదార్ధాలను అందుబాటులోకి తెచ్చి విక్రయిస్తున్న వీధివ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చిన్నపాటి పెట్టుబడితో రోజువారీ నిర్వహించే వ్యాపారo ద్వారా వచ్చే సొమ్ములో కొంత మొత్తాన్ని తిరిగి సరుకుల కొనుగోలుకు ఉంచుకుని మిగిలిన దానిని కుటుంబ ఖర్చులకు వాడుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చే ఆదాయంపై కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటున్న వీధి వ్యాపారులు. ఏదయినా ఆపదవచ్చి ఖర్చులు పెరిగితే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వీధి వ్యాపారుల శ్రమతో వడ్డీ వ్యాపారులు ఆర్ధికంగా బలపడ్డారు. వీధి వ్యాపారుల పరిస్థితులను అధ్యయనం చేసి, వారి ఆర్ధికస్థితి మెరుగుకు తెలంగాణ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

 •అందులో భాగంగా స్ట్రీట్ వెండింగ్ ప్రాంతాలను గుర్తించి, జోన్ల వారిగా విభజన చేసింది. ఆర్థిక సహాయం అందించుటకు వీధి వ్యాపారాలు చేసేవారి గుర్తింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. విడతల వారిగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.
 
ఇప్పటివరకు పురోగతి
*ఇప్పటివరకు గుర్తించిన వీధి వ్యాపారుల సంఖ్య : 6,08,277.
* 1వ విడత రుణాలు (వీధి వ్యాపారికి @ రూ. 10,000/-):- •రుణాల పంపిణీ లక్ష్యం: 3,40,000 మంది వీధి వ్యాపారులు.
 •అప్‌లోడ్ చేసిన దరఖాస్తుల సంఖ్య : 4,02,817.
•పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య : 3,44,944(101%)
* 2వ విడత రుణాలు-వీధి వ్యాపారికి @ రూ. 20,000/- చొప్పున అందజేయాలని నిర్దేశించిన లక్ష్యం : 1,52,500 మంది వీధివ్యాపారులు .
 •నిర్ణిత కాలంలోపే మొదటి విడత రుణాలు తీర్చిన వీధి వ్యాపారుల సంఖ్య : 1,91,351.
 •రెండవ విడత రుణాలకొరకు అప్‌లోడ్ చేసిన దరఖాస్తుల సంఖ్య : 1,91,237 (125%)
 • మంజూరు చేయబడిన రుణాల సంఖ్య : 97,718 (64%)
 • పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య : 68,882 (45%)
 *డిజిటల్ చెల్లింపులను అంగీకరించిన వీధివ్యాపారుల సంఖ్య :3,30,841
 *95% రుణాలు పంపిణీ డిజిటల్ చెల్లింపులు చేయబడ్డాయి. 
*డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్నందుకు ప్రోత్సాహకంగా చెల్లించిన మొత్తం: @ 100/నెల/SV: రూ.3 కోట్ల 10 లక్షలు.
 *డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్న వీధి వ్యాపారులకు  దేశం మొత్తంలో ఇచ్చిన ప్రోత్సాహకంరూ.14 కోట్ల 38 లక్షలలో  22%  తెలంగాణకే లభించాయి.
*రెగ్యులర్ రీపేమెంట్ జరిపినందుకు లభించిన మొత్తం వడ్డీ రాయితీ : రూ 8 కోట్ల 22 లక్షలు. 
 *దేశం మొత్తం ఇచ్చిన వడ్డీ రాయితీ రూ.57 కోట్ల 62 లక్షల్లో  15%తెలంగాణకే లభించింది.
 పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ వెండింగ్ జోన్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది:
*అభివృద్ధి కోసం గుర్తించిన వెండింగ్ జోన్ల సంఖ్య  : 618.
*మొత్తం స్ట్రీట్ వెండింగ్ షెడ్స్ సంఖ్య:2676. 
•ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండింగ్ షెడ్‌ల సంఖ్య :1284.
*నిర్మాణంలో ఉన్న షెడ్స్ సంఖ్య :1392.
పురపాలక సంస్థల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్ధిక సహాయంతో పాటు మౌళిక వసతులతో వీధివ్యాపారుల కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నాయి.

More Press Releases