మైనార్టీల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమలు

Related image

తెలంగాణ సర్వమతాల సమ్మేళనం సంస్కృతులు నెలకొన్న ప్రాంతం. అందుకే ఇక్కడి జీవన సభ్యతను మహాత్మగాంధీ 'గంగా జమున తెహజీబ్' గా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం సకల మతాలను సమాన భావనతో ఆదరిస్తున్నది. గౌరవిస్తున్నది. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నది. గడచిన ఎనిమిది ఏళ్లలో మైనార్టీల సంక్షేమానికి 6,644 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేబట్టి అమలు చేస్తుంది.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ఎనిమిది సంవత్సరాలలో మైనార్టీలలో విద్యా అవకాశాలు కల్పించుటకు తెలంగాణ ప్రభుత్వం 192 మైనార్టీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేసింది.

మైనార్టీ బాలికలు చదువులో ముందుండాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే 50 శాతం గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ గురుకులాలకు విశేష స్పందన లభించింది. నేడు రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల సంఖ్య 204 కు పెరిగింది. ఈ గురుకులాల్లో మొత్తం లక్షా 14 వేల మంది విద్యార్ధినీ, విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్ధినీ, విద్యార్థులపై సంవత్సరమునకు ఒక లక్ష ఇరువది వేలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి భోజనము కల్పించబడుతుంది.

మైనార్టీ బాలికలు పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 121 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసింది. మైనార్టీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18 శాతం ఉంటే నేడు 42 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల మైనారిటీ వర్గంలో ఎంతో సంతృప్తిని, సంతోషాన్నీ కలిగిస్తోంది. మైనార్టీ బాలికల విద్యావికాసంలో తెలంగాణ నేడు దేశంలోనే మొదటి స్థానములో  నిలిచింది.

రాష్ట్ర వ్యాప్తంగా 54 రెసిడెన్షియల్ మైనార్టీ గురుకులాలకు పక్కా భవనాల, అన్నీ హంగులతో, సకల సౌకర్యాలతో  నిర్మాణం జరుగుతోంది. హైదరాబాదులోని 29 కాలేజీల భవనాల నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుతో సంప్రదింపులు జరిపి వక్స్ భూములు ఇవ్వడానికి అంగీకరింపజేసింది. నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్-ఉల్-గుర్బాను 40 పునర్నిర్మించింది.  ఈ భవనం ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.

రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే పది వేల మంది ఇమాం, మౌజమ్ లకు నెలకు 5 వేల చొప్పున ప్రభుత్వం గౌరవవేతనం అందిస్తున్నది. మైనార్టీల ప్రధాన పండుగలయిన క్రిస్మస్, రంజాన్ లను ప్రభుత్వ పండుగలుగా ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నది. ప్రార్థనా మందిరాలకు ప్రత్యేక నిధులను సమకూరుస్తున్నది. మైనారిటీల అభివృద్ధి సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్నీ రంగాలలో వారి అభివృద్దికి కృషి చేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రత్యేకముగా రూపొందిచి అమలు చేస్తుంది.

More Press Releases