సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర

Related image

తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్లో కేటాయించిన 5 ఎకరాల భూమిని, తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురి గౌరిశంకర్ మరియు భవన నిర్మాణ కమిటీ చైర్మన్ లాల్ కోటా వెంకటాచారి మరియు సభ్యులతో కలిసి సందర్శించిన బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల కోసం ఏ ప్రభుత్వం గుంట జాగను కూడా కేటాయించలేదని కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు పరిచే భాగంలో రాష్ట్రంలో ఉన్న 20 లక్షల విశ్వబ్రాహ్మణులకు 5 ఎకరాల భూమి, 5 కోట్లు కేటాయించడమంటే  వారికి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. 

ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల విశ్వబ్రాహ్మణ జాతీయులకు మరియు వారి పిల్లలకు కొండంత భరోసా కలిగిందని, రాష్ట్ర రాజధానిలో 5 ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనం ఉందని ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నపేద విద్యార్ధుల విద్య, పేదింటి ఆడబిడ్డల కల్యాణం కోసం, పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం, పేద విద్యార్థి విద్యార్థినుల స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఉద్యోగఉపాధి అవకాశాల కోసం మరియు వృత్తుల నవీనకరుణ కోసం, జాతి లో ఉన్న పేద వారి అభివృద్ధి కోసం  ఉపయోగపడే విధంగా జాతిలోని ప్రముఖులతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన అన్నారు.

KCR

More Press Releases