విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెలంగాణ విజ‌యం.. దేశానికే ఆద‌ర్శం

Related image

  • చిమ్మ‌టి చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ... దేదీప్య‌మాన వెలుగుల్లోకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ప‌రిస్థితి అంధ‌కార బందురం. క‌రెంటు రాక‌డ‌, ప్రాణం పోక‌డ ఎవ‌రికీ తెలిసేది కాదు. ఆనాడు కరెంటు పోతే కాదు. వ‌స్తే వార్త‌. పేరుకే క‌రెంటు... క‌రెంటు తీగ‌ల మీద బ‌ట్ట‌లు ఆరేసుకునే ప‌రిస్థితి. కోత‌లే కోత‌లు. ప‌వ‌ర్ హాలీ డేలు. ప‌రిశ్ర‌మ‌ల‌కు ఏనాడూ స‌రి ప‌డా క‌రెంటు ఇచ్చిన పాపాన పోలేదు. గృహావ‌సారాలు అస‌లే తీర‌లేదు. రైతాంగం అరి గోస ప‌డ్డ‌ది. క‌రెంటు క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాణ్య‌త‌లేని క‌రెంటుతో ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోయేది. రైతాంగానికి పేరుకే 9 గంట‌ల క‌రెంటు... అర‌కొర‌గా వ‌చ్చే క‌రెంటు త‌క్కువ‌లు ఎక్కువ‌ల‌తో...ట్రాన్స్‌ఫార్మార్లు, మోటార్లు కాలిపోయేది. ఫీజులు ఎగిరిపోయేవి. అవి బాగు కావ‌డానికి రోజులు ప‌ట్టేది. దీంతో పంట‌లు ఎండేవి. రాత్రిళ్ళు ఇచ్చే క‌రెంటు కోసం రైతులు భార్యా బిడ్డ‌ల‌ను వ‌దిలి బావుల ద‌గ్గ‌ర ప‌డుకునేది. చీక‌ట్లో క‌రెంటు షాక్ లు కొట్టి, పాములు, తేళ్ళు కుట్టి చ‌నిపోయిన రైతులెందరో! ట్రాన్స్ ఫార్మ‌ర్ల మీద ఫీజులు వేయ‌డానికని వెళ్ళి మృత్యువాత ప‌డ్డ రైతుల‌కు లెక్క‌లేదు. క‌రెంటు ఉండేది కాదు. ప్ర‌జ‌ల‌కు మంచినీరు అందేది కాదు. ఎండా కాలం వ‌స్తే ఉక్క‌పోతే. చెప్పుకునే దిక్కులేని దిక్కుమాలిన ప‌రిస్థితులు ఆనాటివి.

ఈ క‌ష్టాల క‌డ‌లిని ఈదుతూనే ఈ బ‌తుకులు మాకొద్ద‌ని ప్ర‌జ‌లంతా ఇప్ప‌టి సిఎం అప కెసిఆర్ నేతృత్వంలో ఉద్య‌మించారు. 14 ఏండ్ల అవిశ్రాంత‌, శాంతియుత పోరాటం చేశారు. తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ది? అని వెక్కిరించారు. మీ తెలంగాణ‌ల క‌రెంటు ఉండ‌దు. ఉత్ప‌త్తి కేంద్రాలు లేవు. మీరంతా చీక‌ట్లో మ‌గ్గాలె. అవ‌హేళ‌న చేశారు.  

తెలంగాణ వ‌చ్చింది. 60 ఏండ్ల క‌ల ఆవిష్కార‌మైంది. ఉద్య‌మ నేత కెసిఆర్, సీఎం అవ‌డం అదృష్టంగా మారింది. ప‌ట్టుప‌ట్టి  సీఎం కెసిఆర్ విద్యుత్ రంగంపై దృష్టి పెట్టారు. అదే ప‌నిగా ప‌దే ప‌దే స‌మీక్షిస్తూ, అతి త‌క్కువ కాలంలో అనుకున్న‌ది సాధించారు. తెలంగాణ‌లో విద్యుత్ వెలుగులు విర‌జిమ్మారు.  

ఒక‌వైపు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న‌ వనరులను సద్వినియోగం చేసుకొంటూనే, అవ‌స‌ర‌మైన మేర కొనుగోలు చేస్తూ, ఇవ్వాళ క‌రెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దారు. ఎలాంటి విద్యుత్ కోత‌లు లేకుండా, ప‌వ‌ర్ హాలీడేల స్వ‌స్తి ప‌లికి, నాణ్య‌మైన క‌రెంటును 24 గంట‌ల పాటు నిరంత‌రాయంగా అందిస్తున్నారు. ఇవ్వాళ దేశంలో 24 గంట‌ల క‌రెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది.   

తేదీ 02.06.2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 01.04.2022 నాటికి  17,305 మెగావాట్లకు పెరిగింది. 

సోలార్ విద్యుదుత్పత్తిలో గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,431 వేల మెగావాట్లకు రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. 

పైగా గ‌రిష్ట డిమాండ్ 5,661 మెగావాట్ల నుండి 14,160 మెగావాట్ల‌కు చేరింది. 
గ్రిడ్ విద్యుత్ వినియోగం 128 మెగా యూనిట్ల నుండి 283.83 మెగా యూనిట్ల‌కు పెరిగింది.

ట్రాన్స్ కో లో...
ఇదే స‌మ‌యంలో 400 కెవి. స‌బ్ స్టేష‌న్‌లు 6 మాత్ర‌మే ఉంటే వాటిని 23 కి పెంచుకున్నం
220 కెవి. స‌బ్ స్టేష‌న్‌లు 51 మాత్ర‌మే ఉంటే వాటిని 98 కి పెంచుకున్నం
132 కెవి. స‌బ్ స్టేష‌న్‌లు 176 మాత్ర‌మే ఉంటే వాటిని 247 కి పెంచుకున్నం

మొత్తం ఇహెచ్‌టి స‌బ్ స్టేష‌న్‌లు 233 మాత్ర‌మే ఉంటే, వాటిని 368కి పెంచుకున్నం
మొత్తం ఇహెచ్‌టి పొడ‌వు 16,379 మాత్ర‌మే ఉంటే, వాటిని 27,375కి పెంచుకున్నం
ట్రాన్స్ ఫార్మ‌ర్ల సామ‌ర్థ్యాన్ని 14,973 మెగావాట్లు ఉంటే వాటిని 38,426కి పెంచుకున్నం

డిస్కంల‌లో...
33 కెవి స‌బ్ స్టేష‌న్ల సంఖ్య‌ను 2,138 నుండి 3,159కి పెంచుకున్నం
33కెవి, 11 కెవి, ఎల్ టీ ల పొడ‌వుని 4.89 ల‌క్ష‌ల నుండి 6.58 ల‌క్ష‌ల‌కు పెంచుకున్నం
పిటిఆర్ ల‌ను సంఖ్య‌ను 3,272 నుండి 5,598కి పెంచుకున్నం
డిటిఆర్ ల సంఖ్య‌ను 4.67 ల‌క్ష‌ల నుండి 8.09 ల‌క్ష‌ల‌కు పెంచుకున్నం

మ‌రోవైపు వినియోగ‌దారుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది
వ్య‌వ‌సాయ స‌ర్వీసులు 19.03 ల‌క్ష‌ల నుండి 26.45 ల‌క్ష‌ల‌కు పెరిగాయి. అంటే 40శాతం పెరిగాయి.
రాష్ట్రంలో మొత్తం స‌ర్వీసులు 1.11 కోట్ల నుండి 1.71 కోట్ల‌కు పెరిగాయి. అంటే 54శాతానికి పెరిగాయి.

17 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినా తట్టుకునే విధంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది. 

కొత్తగూడెం జిల్లలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.  
శరవేగంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి ఆల్ట్రా మెగా ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. 

విభ‌జ‌న స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టులో మ‌న వాటా మ‌న‌కు ద‌క్కుండా గండి కొట్టి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపారు.  దీంతో పాటు మ‌న‌కు ద‌క్కాల్సిన విద్యుత్ వాటాను కూడా కోల్పోయాం.

అయినా, వెర‌వ‌కుండా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు దీటుగా, మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ‌లో 24 గంట‌ల విద్యుత్ ని అందించ‌ల‌గుతున్నాం. ఇది క‌చ్చితంగా సిఎం కెసిఆర్ సాధించిన అద్భుత విజ‌యం. విద్యుత్ రంగంలో తెలంగాణ విజ‌యం. దేశానికే ఆద‌ర్శం.

ఔట్ సోర్సింగ్ వ్యక్తుల క్రమబద్ధీకరణ:
తక్కువ వేతనాలతో కాంట్రాక్టర్లతో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ వ్యక్తులు
23,667 మంది సర్వీసులను క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయానికి పూర్తిగా ఉచితంగా నాణ్య‌మైన విద్యుత్ ని అందించ‌డ‌మే కాకుండా, నాయీ బ్రాహ్మ‌ణుల‌కు, దోబీ ఘాట్ల‌కు, లాండ్రీ షాపుల‌కు 250 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ని అందిస్తున్న‌ది. 50శాతం స‌బ్సిడీని చేనేత రంగానికి అందిస్తున్న‌ది.

వ్య‌వ‌సాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్ సర‌ఫ‌రా:
-దేశంలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 
-దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ప్ర‌క‌టించినా, ఆ రాష్ట్రాల్లో ఇచ్చేది కేవ‌లం 7 గంట‌లు మాత్ర‌మే.
-రాష్ట్రంలో 40 శాతం విద్యుత్తు, కేవ‌లం వ్యవసాయరంగానికే సరఫరా అవుతున్నది. 
-ఈ విధంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా, తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ విప్ల‌వానికి దారి తీసింది.
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను కొత్తగా ప్రభుత్వం కల్పించింది. 
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 25.63 లక్షలకు పెరిగింది. 
-2014-15 సంవత్సరం నుండి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం కోసం ప్రభుత్వం రూ.39 వేల 200 కోట్లను సబ్సిడీగా అందజేసింది.

చేనేత‌ల‌కు చేయూత‌గా 50 శాతం విద్యుత్ రాయితీ
చేనేతలను ఆదుకునేందుకు 2014 -15 నుంచి రాష్ట్రంలో 5 హెచ్ పీ లోడ్ తో నడుస్తున్న పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం విద్యుత్తు రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్ద‌ని.
రాష్ట్రం ఏర్ప‌డ్డ‌నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.34.50 కోట్లను 10,000 పవర్ యూనిట్లకుగాను విడుదల చేసింది.

దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు
-ప్రభుత్వం రజకుల దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు  సౌకర్యం కల్పించింది.

*పౌల్ట్రీ, టెక్స్‌టైల్‌ రంగాల వారికి రూ.2 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.

వ్యవసాయ, ఇతర అన్నిరంగాలకు కలిపి క్రాస్‌ సబ్సిడీ, సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,100 కోట్లు చెల్లిస్తున్నది. 

కేంద్రం స‌హాయ నిరాక‌ణ‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్థ్యం గ‌ణ‌నీయంగా పెంచుకున్నాం. అందుకోసమే సంస్థలు రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసుకున్నా యి. కేంద్ర సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఆర్‌ఈసీలు రుణాలను, 12 శాతం మేర వడ్డీకి ఇస్తాయి. ఈ వడ్డీ శాతం వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీ శాతం కన్నా ఎక్కువ. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం కింద పీజీసీఎల్‌కు రూ.1580 కోట్లు చెల్లించాలి.

ఒకే ఒక్క‌సారి విద్యుత్ చార్జీల పెంపు:
ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 శాతం చార్జీల పెంపుదలకు రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్ సిఫార‌సు చేసింది. రాబోయే ఏడాదిలో 74,727 మిలియన్‌ యూనిట్ల కొనుగోలు, రూ.53,054 కోట్ల రెవెన్యూ అవసరాలను అంచనా వేశాయి. కమిషన్‌ రూ.48,708 కోట్ల అవసరాలకు అనుమతినిస్తూ రూ.6,831 కోట్ల చార్జీల పెంపుదల ప్రతిపాదనలకు గాను రూ.5,596 కోట్ల పెంపుదలకు అనుమతినిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్లలో మొదటిసారి స్వలంగా కరెంటు చార్జీలను పెంచింది.
విద్యుత్‌ చార్జీలను ప్రధానంగా ఉత్పత్తి వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయాలు ప్రభావితం చేస్తాయి. 2014-2015లో టన్ను బొగ్గుకు రూ.50గా ఉన్న క్లీన్‌ ఎనర్జీ సెస్‌ ప్రస్తుతం రూ.400లకు పెరిగింది. అదేవిధంగా గత ఐదారేండ్లలో రెట్టింపైన చమురు, గ్యాస్‌ ధరల వల్ల బొగ్గు రవాణా, రైల్వే రవాణా చార్జీలు కూడా పెరిగాయి. మొత్తంగా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది.

తెలంగాణలోనే విద్యుత్‌ ఛార్జీలు త‌క్కువ‌..
మనిషి నిత్య జీవితంతో పెనవేసుకున్న అతి కీలకమైన అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన జీవ‌నం స్తంభించి పోయేంతగా విద్యుత్ వినియోగం జ‌రుగుతున్న‌ది.

క‌రోనా క‌ష్ట కాలంలోనూ విద్యుత్ ఉద్యోగులు బాగా ప‌ని చేశారు
మానవాళి ఊహించని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులను తీవ్ర ప్రభావితం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. దీనికోసం ప్రభుత్వం, విద్యుత్‌సంస్థలు, విద్యుత్‌ ఉద్యోగులు నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రాణాలను కూడా ఫ‌ణంగా పెట్టారనడంలో సందేహం లేదు.

భవిష్యత్తులో విద్యుత్‌ చార్జీలు పెరగకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకొని లాభాల దిశగా పయనించాల్సిన బాధ్యత విద్యుత్‌ సంస్థలు, ఉద్యోగులపైన ఉన్నది. సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకొని లాభాలనిచ్చే వాణిజ్య, పారిశ్రామిక అమ్మకాలను పెంచుకోవడం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి గణనీయమైన అవకాశాలున్నాయి. ఇందుకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని విధాలుగా రాష్ట్ర విద్యుత్ సంస్థ‌ల‌కు త‌మ పూర్తి స‌హ‌కారాన్ని అన్ని విధాలుగా అందిస్తున్న‌ది.

పవర్ సెక్టార్ యొక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు
(01.05.2022 నాటికి)

24 గంటల ఉచిత వ్యవసాయ సరఫరా:
24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
26.60 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ 
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 2014-15 నుండి 2021-22 వరకు రూ.30,155 కోట్ల స‌బ్సిడీ

కొత్త వ్యవసాయ సేవలు:
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 7.57 లక్షల వ్యవసాయ సర్వీసులు విడుదలయ్యాయి.

ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో పెట్టుబడి:
24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ట్రాన్స్‌కో మరియు డిస్కమ్‌ల ద్వారా 2014 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.36,227 కోట్లు పెట్టుబడి పెట్టారు.

దేశీయ వినియోగదారులకు టారిఫ్ సబ్సిడీ
ప్రభుత్వం 2014-15 నుండి 2021-22 వరకు రూ.10,826 కోట్ల సబ్సిడీని అందించింది.
దాదాపు 1కోటి 41ల‌క్ష‌ల 952 లబ్ది పొందే దేశీయ వినియోగదారులకు సబ్సిడీ టారిఫ్ కోసం
ప్రతి సంవత్సరం వినియోగదారులు.

 SC & ST వినియోగదారులకు సబ్సిడీ: - :
ప్రభుత్వం ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోంది
5,12,707 SC వినియోగదారులు మరియు 2,85,520 ST వినియోగదారులు.

 నయీ బ్రాహ్మణులు మరియు ధోభి ఘాట్‌లకు సబ్సిడీ :-
28,464 మంది నాయీ బ్రాహ్మణులు/కేశవులకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.
కటింగ్ సెలూన్లు మరియు 52,440 ధోభి ఘాట్‌లు/లాండ్రీ దుకాణాలు.

 పౌల్ట్రీ ఫారాలు మరియు పవర్ లూమ్‌లకు సబ్సిడీ :-
ప్రభుత్వం 6467 పౌల్ట్రీ ఫారాలకు రూ.2.00/యూనిట్ సబ్సిడీని అందిస్తోంది మరియు
2015 నుండి 5047 పవర్ లూమ్‌లకు రూ.2.00/యూనిట్.

 పల్లెప్రగతి మరియు పట్టణ ప్రగతి :-
పెట్టుబడితో పంపిణీ నెట్‌వర్క్‌ని సరిదిద్దడం జరిగింది
పల్లెప్రగతి కింద రూ.333 కోట్లు 41.98 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చింది.
పెట్టుబడితో పంపిణీ నెట్‌వర్క్‌ని సరిదిద్దడం జరిగింది
పట్టణప్రగతి కింద రూ.134 కోట్లు 23.15 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చింది.

టారిఫ్ సబ్సిడీ:-
తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 10,602 కోట్లు
2022-23 సంవత్సరంలో పంపిణీ సంస్థలు ఉచిత విద్యుత్ సరఫరాను అందించడానికి
26.60 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు మరియు గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్.  

More Press Releases