'లిటిల్‌ హార్ట్స్‌' మూవీ రివ్యూ

  • నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌గా 'లిటిల్‌ హార్ట్స్‌' 
  • మెప్పిస్తున్న వినోదం 
  • సింపుల్‌ లైన్‌తో 'లిటిల్‌హార్ట్స్‌'
సాధారణంగా థియేటర్‌లో విడుదల చేయాలని నిర్మించిన కొన్ని సినిమాలు కొన్ని కారణాలతో డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం జరుగుతుంది. కానీ 'లిటిల్‌హార్ట్స్‌' విషయంలో మాత్రం ఇది రివర్స్‌ అయ్యింది. ఓటీటీ వర్జినల్‌ మూవీగా ఈటీవీ విన్‌ తమ ఓటీటీ కోసం నిర్మించిన 'లిటిల్‌హార్ట్స్‌' సినిమాని చూసి నచ్చిన నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమా థియేటర్ కంటెంట్‌ అని భావించి  'లిటిల్‌హార్ట్స్‌'ను ముందుగా థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. '90స్‌ మిడిల్‌ క్లాస్‌' సినిమాతో అందరికి సుపరిచితుడైన మౌళి తనూజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి  '90స్‌' దర్శకుడు ఆదిత్యహాసన్‌ నిర్మాత. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.. 

కథ: మౌళి (అఖిల్‌) ఇంజనీరింగ్‌లో ర్యాంక్‌ రాకపోవడంతో కోసం తండ్రి  గోపాల రావు (రాజీవ్‌ కనకాల)కు ఎదురుచెప్పలేక లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటూ ఉంటాడు. కాత్యాయిని (శివానీ నాగారం) కూడా అదే కోచింగ్‌ సెంటర్‌లో ఏమ్‌బీబీఎస్‌ సీటు కోసం లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కి జాయిన్‌ అవుతుంది. ఆమె అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లే. ఇక అక్కడే అఖిల్‌, కాత్యాయిని మధ్య ప్రేమ చిగురిస్తుంది. 

అఖిల్‌ తను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేస్తాడు. అప్పుడు కాత్యాయిని తనకు సంబంధించిన ఓ విషయాన్ని బయటపెడుతుంది. దాంతో అఖిల్‌ ఆశ్చర్యానికి గురవుతాడు. అసలు కాత్యాయిని ఏం చెప్పింది? వీరిద్దరి ప్రేమకు అడ్డుగా ఉన్న విషయమేమిటి? వీళ్లిద్దరి ప్రేమ ఫలిచిందా? లేదా? అనేది మిగతా కథ 

విశ్లేషణ: ఇదొక సింపుల్‌ కథ. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా అల్లుకున్న స్టోరి ఇది. అయితే ఇందుకు తగ్గ కామెడీ సన్నివేశాలను, ఆకట్టుకునే వన్‌లైనర్‌ పంచ్‌లను దర్శకుడు చక్కకగా సమాకూర్చుకున్నాడు. కోచింగ్‌ సెంటర్‌లో ప్రేమ పుట్టడమే ఈ చిత్రంలో ఉన్న నవ్యమైన కాన్సెప్ట్‌. అంతకు మించి కొత్తదనమేమి లేదు. అయితే చదువులో డల్‌గా ఉండే అబ్బాయి, అమ్మాయిల ప్రేమకథ, వాళ్ల చుట్టు ఉండే స్నేహితులు, అనగానే కామెడీకి ఎక్కువగా స్కోప్‌ ఉంటుంది. అందుకు తగినట్లుగానే ఈ సినిమాకు సన్నివేశాలు రాసుకోవడం చిత్రానికి బిగ్గెస్ట్‌ ప్లస్‌. లార్జర్‌ దేన్‌ లైఫ్‌, యాక్షన్‌ సినిమాల పేరిట కామెడీని మిస్‌ అవుతున్న తెలుగు ప్రేక్షకుల వీక్‌నెస్‌ను క్యాచ్‌ చేసి దర్శకుడు ఈ చిత్రం కోసం మంచి కామెడీ పంచ్‌లను రాసుకున్నాడు. 

ఫస్ట్‌హాప్‌ ఎంతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా మౌళి, రాజీవ్‌ కనకాల, శివానీ,  మౌళి ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఎంటర్‌టైన్‌ చేశాయి. అందరి కాలేజ్‌డేస్‌ల్లో ఎక్కువ జరిగే ఇన్‌సిడెంట్స్‌ను ఈ చిత్రంలో పెట్టడం వల్ల యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. ద్వితీయార్థంలో కూడా కామెడీ ఆగలేదు. హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ సన్నివేశాలు, ఇద్దరూ కలుసుకునేందుకు పడే ఆగచాట్లు నవ్వు తెప్పిస్తాయి.  అయితే ఈ చిత్రానికి ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా, కన్వీన్సింగ్‌గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఇది మినహాయిస్తే సినిమా ఆద్యంతం నవ్వులు పండిస్తుంది దీంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తరువాత ఓ రిలాక్స్‌ మూడ్‌లో బయటికొస్తారు. 

నటీనటుల పనితీరు: అఖిల్‌ పాత్రలో మౌళి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. కామెడీ సన్నివేశాలు ఆయన హావభావాలు అందరిని మెప్పిస్తాయి. ముఖ్యంగా కాత్యాయిని.. కాత్యాయిని అంటూ కొనసాగే ఓ పాటలో ఆయన నటన, డ్యాన్సులు థియేటర్‌లోని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. కాత్యాయిని పాత్రలో శివానీ నాగారం మెప్పించింది. స్నేహితుడిగా నటించిన జయకృష్ణ కామెడీని అందరూ ఇష్టపడే విధంగా ఉంటుంది. 

రాజీవ్ కనకాల, అనిత చౌదరి, ఎస్‌.ఎస్.కాంచీ, సత్యకృష్ణన్‌లు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించారు. అలరించారు. సింజిత్‌ పాటలు ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. కథలో భాగంగా వచ్చే పాటల్లో కూడా వినోదం ఉంటుది. దర్శకుడు సాయి మార్తండ్‌ దర్శకత్వ ప్రతిభ మెచ్చుకునే స్థాయిలో ఉంది. ముఖ్యంగా అందరికి తెలిసిన కథ, ఏమీ జరగబోతుందో ముందే తెలిసిన సన్నివేశాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ప్రెజెంట్‌ చేసిన విధానం బాగుంది. 

ఓవరాల్‌గా సింపుల్‌ కామెడీని, వన్‌లైనర్స్‌ సంభాషణలను ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులకు 'లిటిల్‌హార్ట్స్‌' అలరిస్తుంది.

Movie Details

Movie Name: Little hearts

Release Date: 2025-09-05

Cast: Mouli Tanuj, Shivani Nagaram, Rajeev Kanakala, S. S. Kanchi, Anita Chowdary, Satya Krishnan

Director: Sai Martand

Producer: Aditya Hasan

Music: Sinjit Yerramalli

Banner: ETV Win Original Productions

Review By: Madhu

Little hearts Rating: 2.75 out of 5


More Movie Reviews