కోలీవుడ్ లో మణికందన్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'కుడుంబాస్థాన్'. ఈ ఏడాది జనవరి 24వ తేదీన విడుదలైంది. వినోత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించాడు. మణికందన్ - శాన్వి మేఘన ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
కథ: నవీన్ (మణికందన్) వెన్నెల ( శాన్వి మేఘన) ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇద్దరు కులాలు వేరు కావడం వలన, ఇరు కుటుంబాలవారు అందుకు నిరాకరిస్తారు. అయినా వారి మాటలను పక్కన పెట్టేసి, తన స్నేహితుల సాయంతో నవీన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. నవీన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు. తల్లి సుబ్బలక్ష్మి - తండ్రి మూర్తితో కలిసి నవీన్ జీవిస్తూ ఉంటాడు.
నవీన్ కి ఒక అక్కయ్య ఉంటుంది .. ఆమె పేరే అనిత ( నివేదిత రాజప్పన్). ఆమె భర్త రాజేంద్రన్ (గురు సోమసుందరం). రాజేంద్రన్ ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అతను నవీన్ ను అవమానించడానికి రెడీ అవుతూ ఉంటాడు. డబ్బు అన్నింటినీ .. అందరినీ నడిపిస్తుంది అనే నమ్మకంతో రాజేంద్రన్ ఉంటాడు. డబ్బు కంటే కూడా ప్రేమానురాగాలు గొప్పవనే అభిప్రాయంతో రాజేంద్రన్ ఉంటాడు.
నవీన్ ను తమ అవసరాలు .. కోరికలు తీర్చే ఒక యంత్రంలా అతని తల్లిదండ్రులు చూస్తుంటారు. అయితే అంతకంటే ముందుగా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న తన భార్యకి ల్యాప్ టాప్ కొనివ్వాలని నవీన్ అనుకుంటాడు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే నవీన్ జాబ్ పోతుంది. ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్పకుండా, ఆ నెల ఇల్లు గడవడం కోసం నవీన్ ఆన్ లైన్ లో 'లోన్' తీసుకుంటాడు. అంతే కాకుండా సొంత బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరొకరిదగ్గర అప్పు చేస్తాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.
విశ్లేషణ: పెళ్లి తరువాత జీవితం మరింత అందంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అయితే వివాహమైన కొద్ది రోజులకే జాబ్ పోయి .. అప్పుల పాలైన ఒక యువకుడు, తన భార్యకి నిజం తెలిసేలోగా తాను ఎదగాలని అనుకుంటాడు. అందుకోసం తీసుకున్న నిర్ణయాలు ఆయనను మరింత ఊబిలోకి నెడితే ఎలా ఉంటుందనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్నాడు.
డబ్బు సంపాదిస్తూ ఉంటేనే పేరెంట్స్ ప్రేమిస్తూ ఉంటారనీ .. భార్య గౌరవిస్తూ ఉంటుందనీ .. అక్కాబావలు విలువనిస్తూ ఉంటారనే విషయం నవీన్ కి అర్థమవుతుంది. ఈ పాత్రలన్నీ సందర్భాన్ని బట్టి హీరో పాత్రను టచ్ చేస్తూనే ఉంటాయి. అయితే ప్రధానమైన కథ, డబ్బే గొప్పదనే బావ పాత్రకీ .. అనుబంధాలే ముఖ్యమనే నవీన్ పాత్రకి మధ్య నడుస్తూ ఉంటుంది. చివరికు ఎవరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారనేది కథ.
ఉద్యోగం .. పెళ్లి .. ఇల్లు .. అనే మూడు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఒక మగాడికి ఈ మూడు వాయువుల నుంచి సమస్యలు ఎదురైతే అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే దిశగా దర్శకుడు ఈ కామెడీ డ్రామాను నడిపించిన తీరు మెప్పిస్తుంది. జోనర్ కి తగిన విధంగానే దర్శకుడు కథను నడిపించాడు. సంపాదించేవాడికి కాస్త సపోర్టు చేయండి అనే రిక్వెస్ట్ తో కూడిన సందేశం ఈ కథలో కనిపిస్తుంది.
పనితీరు: ఏ మగాడైనా ఆఫీసులో వాతావరణం బాగుంటే ఇంట్లో భార్యతో హ్యాపీగా ఉంటాడు. ఇంట్లో హ్యాపీగా ఉంటేనే ఆఫీసులో అందరితో సరదాగా ఉంటాడు. కానీ ఈ రెండు చోట్లా మనఃశాంతి లేకపోతే ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా ఉంటాడనే దిశగా దర్శకుడు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సహజత్వానికి దగ్గరగా కంటెంట్ ను ఆడియన్స్ కి చేరువుగా తీసుకుని వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
సుజిత్ సుబ్రహ్మణ్యం ఫొటోగ్రఫీ .. వైశాఖ్ నేపథ్య సంగీతం .. కన్నన్ బాలు ఎడిటింగ్ ఫరవాలేదు. ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా, ఆ పాత్రలను మలిచిన తీరు ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. 'ఎంత సంపాదిస్తున్నామనే విషయం కంటే, ఏమేం కోల్పోతున్నాం అనే ఆలోచన ముఖ్యం' అనే విషయాన్ని క్లారిటీతో చెప్పారు. ఆశించిన స్థాయి కామెడీ లేకపోయినా, సహజత్వానికి దగ్గరగా మలచడంలోని కిక్ .. ఆడియన్స్ ను మెప్పిస్తుంది.
'కుడుంబాస్థాన్' (జీ 5) మూవీ రివ్యూ!
| Reviews

Kudumbasthan Review
- మణికందన్ హీరోగా 'కుడుంబాస్థాన్'
- జనవరి 24న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన స్ట్రీమింగ్
- సహజత్వానికి దగ్గరగా సాగే వినోదభరితమైన డ్రామా
Movie Name: Kudumbasthan
Release Date: 2025-03-07
Cast: Manikandan, Saanvi Meghana, SundaraRajan, Guru Somnasundar
Director: Rajeshwae Kalaisami
Music: Vaisakh
Banner: Cinemakaaran
Review By: Peddinti
Kudumbasthan Rating: 2.75 out of 5
Trailer