Advertisement

'ఐయామ్ గేమ్' (మూవీ రివ్యూ)

Movie Reviews
Rating: 1.75/5Action, Drama, FantasyMovie details ›
Advertisement

I'm Game Review

మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో దుల్కర్ సల్మాన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకి మంచి మార్కెట్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లను .. రోల్స్ ను  ఎంచుకుంటూ దుల్కర్ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'ఐయామ్ గేమ్'. సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించాడు. కయాదు లోహర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, జియో హాట్ స్టార్ లో ఈ నెల 6వ తేదీ నుంచి తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.

డ్యాన్ జాన్ ( దుల్కర్ సల్మాన్) ఓ శ్రీమంతుడి ఒక్కగానొక్క కొడుకు. డబ్బు ఉంటేనే ఈ సమాజంలో గౌరవం ఉంటుందని తండ్రి చెప్పిన మాటను అతను మరోలా అర్థం చేసుకుంటాడు. ఆ డబ్బును సాధ్యమైనంత త్వరగా సంపాదించాలనే ఒక కోరిక అతనిలో బలంగా పాతుకుపోతుంది. అతను బిజినెస్ ను ఎంతమాత్రం పట్టించుకోకపోగా, కోట్లలో అప్పులు చేస్తూ వెళ్లడం తండ్రిని మానసికంగా కుంగదీస్తుంది. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా ప్రయోజనం లేకపోతోంది. ఈజీ మని కోసం జూదం ఆడటం మొదలుపెడతాడు. 

జూదంలో చాలా డబ్బుపోగొట్టిన జాన్, అక్కడివాళ్లతో గొడవపడతాడు. వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రమాదంలో కుడిచేయిని కోల్పోతాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం వలన, మరొకరి చేతిని జాన్ కి అమర్చుతారు. ఆ సమయంలో ఒక 'ఫిజియో థెరపిస్ట్' గా అతనికి సేవ చేస్తుంది 'ఇషా' (కయాదు) లోహర్. ఆమె కారణంగా అతను త్వరగా కోలుకోగలుగుతాడు. తాను శారీరకంగా .. మానసికంగా కోలుకోవడానికి కారణమైన ఇషాను జాన్ ఇష్టపడతాడు. అయితే కొత్తగా అమర్చిన చేయి, అతని నియంత్రణ లేకుండా పనిచేయడం మొదలుపెడుతుంది. 

జాన్ తన కుడి చేయి దానంతట అదే అనూహ్యంగా స్పందించడం చూసి ఆశ్చర్యపోతాడు. ఒక్కోసారి అది తనపైనే దాడి చేస్తుండటంతో అతను బిత్తరపోతాడు. తన ఉద్దేశం ఏమిటనేది ఆ చేయి ఫోన్ లో టైప్ చేసి చెప్పేస్తూ ఉంటుంది. డబ్బు .. పలుకుబడి ఉన్న 'డేవిడ్ అబ్రహం' (మిస్కిన్)ను చూడగానే జాన్ చేయి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అతనిని చంపాలని ఉందని ఫోన్లో టైప్ చేస్తుంది.  అసలు జాన్ కి అమర్చిన ఆ చేయి ఎవరిది? ఆ వ్యక్తికి డేవిడ్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన జాన్ కి ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? విషయాన్ని గ్రహించిన డేవిడ్ ఏం ప్లాన్ చేస్తాడు? అనేది మిగతా కథ.

ఒక వ్యక్తికి సంబంధించిన కళ్లు మరొకరికి అమర్చడం వలన, ఆ కళ్లు అమర్చబడిన వ్యక్తి చిత్రంగా ప్రవర్తించడం వంటి కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే ఒక వ్యక్తికి సంబంధించిన చేయిని హీరోకి అమర్చడం వలన, ఆ హీరో జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది ప్రధానమైన కథాంశంగా చేసుకుని రూపొందిన సినిమా ఇది. హీరోకి ఇష్టం లేని పనులు చేయించే అతని 'చేయి'నే ఈ కథలో విలన్ కావచ్చునేమో అనే సందేహాన్ని కలిగిస్తుంది.

జాన్ విలాసవంతమైన జీవితం .. జూదం .. అప్పులు .. సర్జరీ ద్వారా చేయి మార్చడం .. ఆ చేయిపై నియంత్రణ లేకపోవడం వలన జాన్ నానా అవస్థలు పడటం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ కొనసాగుతుంది. ఇక తనకి అమర్చబడిన ఆ చేయి ఎవరిది? అనే విషయం తెలుసుకోవడానికి జాన్, తనకి ఎలాంటి సంబంధం లేని జాన్ తనపై ఎందుకు దాడి చేస్తున్నాడనేది తెలుసుకోవడానికి డేవిడ్  చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.

ఫస్టాఫ్ కి సంబంధించి .. జాన్ కి అమర్చిన చేయి ఎవరిదీ? అతని నేపథ్యం ఏమిటి? అనే అంశం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. సెకండాఫ్ లో ఆ విషయాన్ని రివీల్ చేసే సమయం కోసం అందరూ వెయిట్ చేస్తారు. అయితే సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో కొత్తదనం లేకపోవడం వలన కాస్త నిరాశ కలుగుతుంది. క్రికెట్ .. బెట్టింగ్ తో కూడిన సుదీర్ఘమైన సన్నివేశాలు ఆడియన్స్ కి కాస్త అసహనాన్ని కలిగిస్తాయి. 

ఫస్టాఫ్ లో హీరోకి వ్యతిరేకంగా 'చేయి' పనిచేసే సన్నివేశాలు ఎక్కువైపోయాయి. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి మరీ డీటెయిల్డ్ గా చూపించడానికి ప్రయత్నించేసరికి నిడివి పెరిగిపోయింది. యాక్షన్ .. ఎమోషన్ .. లవ్ .. డ్రామాకి సంబంధించిన సన్నివేశాలలో అంతగా గాఢత కనిపించదు. రొటీన్ సన్నివేశాలు .. అంచనాలకు దొరికిపోయే సన్నివేశాలతో నిడివి పెరిగిపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది.

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా బాగానే చేశారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ లోను .. సెకండాఫ్ లోను కత్తెర పడవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, రొటీన్ కంటెంట్ కారణంగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.  

Movie Details

Movie Name: I'm Game

Genre: Action, Drama, Fantasy

Release Date: 6 Nov 2026

Cast: Dulquer Salmaan, Antony Varghese, Mysskin, Kayadu Lohar, Vinay Forrt

Director: Nahas Hidhayath

Music: Jakes Bejoy

Banner: Wayfarer Films

Review By: Peddinti

I'm Game Rating: 1.75 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
I'm GameNahas HidhayathDulquer Salmaan Jom VargheseDulquer SalmaanAntony VargheseMysskinKayadu LoharVinay Forrt

More Movie Reviews

DNK Movie Review

13 Nov, 21:07

మౌళి 'డీఎన్‌కే' మూవీ రివ్యూ

13 Nov, 20:59

Itlu Arjuna Movie Review

13 Nov, 15:02

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46

'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

12 Nov, 14:51

'అనకాపల్లి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

11 Nov, 13:18

'మేడమ్ ఇన్ స్పెక్టర్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

10 Nov, 15:45

'అనుగ్రహీతన్ ఆంటోనీ' ( ఈటీవీ విన్) మూవీ రివ్యూ! 

08 Nov, 08:27

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07
..More Movie Reviews