మౌళి 'డీఎన్‌కే' మూవీ రివ్యూ
Advertisement
DNK Review
'లిటిల్ హార్ట్స్' చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మౌళి. ఆ చిత్రం అందించిన విజయంతో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు. మైత్రీ సంస్థలో మౌళి హీరోగా నటించిన చిత్రమే 'డీఎన్‌కే'. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరీ ఈ చిత్రం కథ ఏమిటి? మౌళి హీరోగా మరో హిట్ అందుకున్నాడా? తెలుసుకుందాం..
విశాఖపట్నంకు చెందిన మిడిల్ క్లాస్ యువకుడు ఈశ్వర్ (మౌళి). చదువు అబ్బకపోవడంతో బీటెక్‌ను మిడిల్ డ్రాప్ చేసి అప్పులు చేసుకుంటూ.. బెట్టింగ్స్ వేస్తూ ఓ లక్ష్యం లేకుండా జీవితాన్ని గడుపుతుంటాడు. అవసరాల కోసం లవ్ చేసిన అమ్మాయి దీపు (సుష్మిత శెట్టి)కి కూడా మోసం చేసి ఆమె దగ్గర్నుంచీ రూ. 10 లక్షల విలువైన బంగారం, డబ్బులు కాజేస్తాడు. ఇక ఈ విషయం దీపు ఇంట్లో తెలియడంతో ఈశ్వర్‌కు సమస్యలు మొదలవుతాయి.
ఒకవైపు ప్రేమించిన అమ్మాయి తండ్రి పుల్లయ్య (రఘుబాబు) తమ డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేయడం, మరో వైపు అప్పుల వాళ్లు వెంటపడటంతో వేరే మార్గం లేకపోవడంతో స్నేహితుడు కలిసి దొంగతనం చేయడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలోనే ఓ బంగారు దుకాణంలో దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే అక్కడ ఊహించని పరిణామం జరుగుతుంది. అసలు అక్కడ జరిగిందేమిటి? బంగారం షాపులో ఏం జరిగింది? ఆ దొంగతనం వల్ల మౌళి ఫ్యామిలీ ఎదుర్కొన ఇబ్బందులేమిటి? తరువాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఇదొక సాదాసీదా క్రైమ్ డ్రామా. ఎటువంటి మలుపులు.. ఆసక్తికరమైన ట్విస్టులు లేని రొటిన్ కథ. కథ ప్రారంభం నుంచే ఎంతో నీరసంగా సాగుతుంది. దర్శకుడు రాసుకున్న ఈ కథలో ఏ మాత్రం కొత్తదనం.. ఆసక్తి కనిపించదు. అసలు ఇలాంటి బలహీనమైన కథతో వెండితెరపై సినిమా తీయాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథ ప్రారంభం నుంచి చివరికి వరకు ఆద్యంతం బోరింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ అంతా ఈశ్వర్ చేసే పోకిరి పనులు, అల్లరి చిల్లరి కామెడీతో క్రింజ్‌గా అనిపించడం.. ఇంతకు మించి నాసిరకమైన కామెడీ మనం చూడలేదు అన్నట్లుగా వచ్చే సన్నివేశాలతో సినిమా కథనం ఉంటుంది.
సినిమా ఆద్యంతం భూతద్దం పెట్టి వెతికినా అలరించే సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. ప్రతి సీక్వెన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంటుంది. ద్వితీయార్థంలో వచ్చే సీన్స్, కన్‌ఫ్యూజన్ కామెడీని చూస్తే ప్రేక్షకుడు థియేటర్ నుంచి ఎలా బయటపడాలి అనిపించేత విసుగు వస్తుంది. ఎలాంటి ఫ్లాప్ సినిమాలోనైనా కనీసం చెప్పుకోవడానికి ఒకట్రెండు సన్నివేశాలైనా ఉంటాయి. ఈ సినిమాలో అది కూడా కనిపించదు. సినిమా పూర్తవగానే టైటిల్ మాత్రం కరెక్ట్‌గా పెట్టాడని.. ఈ సినిమాకు యాప్ట్ టైటిల్ ఇంతకు మించి ఉండదనే భావన కలుగుతుంది.
'లిటిల్‌హార్ట్స్'లో ఇన్నోసెంట్ ఫేస్‌తో.. కామెడీ నటనతో అలరించిన మౌళి.. ఆ చిత్రం అందించిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో.. ఈ సినిమాలో అలరించలేక పోయాడు. స్టోరీలో బలం లేకపోవడంతో ప్రతి పాత్ర వీక్‌గానే కనిపించింది. కథానాయిక సుష్మిత పాత్ర కూడా అంతంత మాత్రమే. జైకృష్ణ కామెడీ ఈ సినిమాకు కాస్త రిలీఫ్. సింగీత్ సింగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఫైనల్‌గా ఎలాంటి కొత్తదనం లేని కథ. కథనాలతో.. ఎంటర్‌టైన్‌మెంట్...ఎమోషన్.. ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకోకుండా... డీఎన్‌కే ప్రేక్షకులను పూర్తి నిరాశపరుస్తుంది.

Movie Details
Movie Name: DNK
Genre: Comedy
Release Date: 13 Nov 2026
Cast: Mouli Tanuj Prasanth, Sushmitha Shetty, Ali, Rajitha, Raghubabu, Priya, Gundu Sudharshan
Director: Sreenu Kambala
PRO: vamshi shekar
Music: Sinjith Yerramalli
Banner: Mythri Movie Makers
Review By: Madhu
DNK Rating: 1.5 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement