'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)
Advertisement
Itlu Arjuna Review
ఇండస్ట్రీలోకి హీరోగా మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత మహేశ్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా తెరపైకి వచ్చాడు. ఆ సినిమాయే 'ఇట్లు అర్జున'. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అనశ్వర రాజన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. 'ఛాంపియన్' తరువాత తెలుగులో ఆమె చేసిన రెండో సినిమా ఇది. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించడం, నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈ రోజే విడుదలైన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
'ముని' వాటిని తీసుకుంటూ ఉండగా, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి గద్దలా వచ్చి వాటిని తన్నుకుపోతాడు. ఆ ప్రయత్నంలోనే పెద్దన్న కొడుకు 'ముని' ప్రాణాలు కోల్పోతాడు. తన కొడుకు 'ముని'ని ఎవరు చంపారు? తనకి దక్కవలసిన వెయ్యి కోట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను ఎత్తుకుపోయిందెవరు? తనకి వెంటనే తెలియాలని చెప్పి హిరానీ .. గౌరీతో పాటు ఇతర అనుచరులకు పెద్దన్న పురమాయిస్తాడు. వాళ్లంతా కూడా ఆ హెల్మెట్ వ్యక్తి ఎవరనేది తెలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక ఈ నేపథ్యంలోనే చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ పెరిగిన 'అర్జున్', ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉంటూ ఉంటాడు. మాటలు రాని అతను స్కూల్ డేస్ నుంచి 'కీర్తి' (అనశ్వర రాజన్)ని మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. తండ్రిలేని కీర్తి .. పూర్తిగా తల్లి పెంపకంలోనే పెరుగుతుంది. కీర్తిని అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నాలలో ఆమె ఉంటుంది. ఎలాగైనా కీర్తిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆమె బావ కిశోర్ (వెన్నెల కిశోర్) ఉంటాడు. ఒకసారి పనిపై కీర్తి తల్లి ఢిల్లీ వెళ్లిన సమయంలో, కీర్తికి అర్జున్ తో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సరదాగా బయటికి వెళ్లిన ఇద్దరూ, తమకి తెలియకుండానే 'వెయ్యికోట్ల' మేటర్లో చిక్కుకుంటారు. అందులో నుంచి వాళ్లు బయటపడతారా లేదా? అనేది మిగతా కథ.
చిన్నప్పటి నుంచి 'దొంగ' అనే ముద్ర పడిన కారణంగా, తన ఈడు పిల్లలకు అర్జున్ దూరమైపోతాడు. అయితే అప్పటి నుంచి అతను కీర్తిని మౌనంగా ఆరాధిస్తూ పెరుగుతాడు. పద్ధతి అనే పంజరంలో నుంచి బయటపడి స్వేచ్ఛాను అనుభవించాలనే ఆలోచనతో ఉన్న కీర్తి, అర్జున్ కి దగ్గరవుతుంది. తనకి దక్కవలసిన వెయ్యికోట్ల కోసం .. తన కొడుకు చావుకు కారణమైన వాళ్ల కోసం వెదుకుతున్న విలన్ కి, ఈ ఇద్దరూ కారకులుగా కనిపిస్తారు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
వెయ్యి కోట్లకి సంబంధించిన పెన్ డ్రైవ్ కోసం విలన్ గ్యాంగ్ వెదకడం .. ఆ పెన్ డ్రైవ్ కోసం గాలించే గ్రూపులు పెరుగుతూ పోవడం .. వాళ్లందరి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో - హీరోయిన్ నానా తంటాలు పడటం వంటి అంశాలతో తెరపై కథ పరిగెడుతూ ఉంటుంది. ఇదంతా చదువుతూ ఉంటే, గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కదా అనిపిస్తుంది. నిజంగానే వచ్చాయి కూడా. కాకపోతే దర్శకుడు ట్రీట్మెంట్ తో ఇక్కడ కూర్చోబెట్టేస్తాడు. వెయ్యికోట్ల చుట్టూ ఒక ఆసక్తికరమైన దాగుడుమూతల ఆటను పరిగెత్తిస్తాడు.
వెయ్యికోట్ల కోసం మూడు బ్యాచ్ లు తీవ్రంగా గాలిస్తూ ఉండటం .. ఈ మూడు బృందాల నుంచి తప్పించుకునే టెన్షన్ లో హీరో - హీరోయిన్ ఉంటే, ఆ మధ్యలో హీరోయిన్ ను సొంతం చేసుకోవడం కోసం వెన్నెల కిశోర్ ప్రయత్నించడం కథకి మరింత వినోదాన్ని అద్దుతుంది. ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్టులు .. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది.
అనీష్ కి ఇది మొదటి సినిమా. అందువలన నటన పరంగా .. డాన్స్ పరంగా గట్టిగానే కష్టపడ్డాడు. మాటలు రాని అర్జున్ పాత్రలో మెప్పించడానికి ప్రయత్నించాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో .. డాన్సుల విషయంలో అతను ఇంకా చాలానే నేర్చుకోవలసి ఉంది. అనశ్వర రాజన్ ఆల్రెడీ తానేమిటన్నది ప్రూవ్ చేసుకున్నది గనుక, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ముఖేశ్ రుషి విలనిజం ఆడియన్స్ కి పరిచయమే.
ఇక ఈ సినిమా విషయంలో ఎక్కువ మార్కులు కొట్టేసేది తమన్ అని చెప్పాలి. ఆయన అందించిన బాణీలు బాగున్నాయి. 'అనగనగా ఆకాశంలో' .. ' ఉండిపో ఇలా నా గుండెలో' పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని చెప్పాలి. రాజా మహదేవన్ కెమెరా పనితనం .. కోటి ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలలను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది.
కథా పరంగా చూసుకుంటే రొటీన్ గానే అనిపిస్తుంది. కాకపోతే దర్శకుడు ఈ కథనాన్ని నడిపించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక ప్రేమకథకు వినోదాన్ని .. ఎమోషన్ ను .. యాక్షన్ ను ... కామెడీని కలిపి చెప్పిన తీరు ఆడియన్స్ మనసుకు పట్టుకుంటుంది. కట్టిపడేసే కలర్ ఫుల్ సాంగ్స్ తో పాటు, 'నేను సరిగ్గా స్నానమే చేయను .. ఇక మోసం ఎలా చేస్తాను సార్' వంటి వెన్నెల కిషోర్ డైలాగులు మరింత వినోదాన్ని పంచుతాయి. ఇది ఈ మధ్య కాలంలో రక్తపాతం లేకుండా రక్తి కట్టించిన సినిమా అనే చెప్పుకోవలసి ఉంటుంది.
'పెద్దన్న' (ముఖేశ్ రుషి) ఒక మాఫియా ముఠాను నడుపుతూ ఉంటాడు. తాను అనుకున్నది దక్కించుకోవడం కోసం ఎవరి ప్రాణాలనైనా తీసేయడం ఆయనకి చాలా తేలిక. తన వర్గంలో 'గౌరీ'( కలై యరసన్) పోలీస్ డిపార్టుమెంటులో హిరానీ (కుమార వేల్) పట్ల ఆయనకి నమ్మకం ఎక్కువ. హవాలా రూపంలో పెద్దన్న చేతికి చేరడానికి 1000 కోట్లు సిద్ధమవుతాయి. అందుకు సంబంధించిన వివరాలు ఒక 'పెన్ డ్రైవ్'లో .. 'పాస్ వర్డ్' ఒక బుక్ లో సీక్రెట్ కోడ్ తో ఉంటుంది. అయితే ఆ పాస్ వర్డ్ 30 రోజులలోపు మాత్రమే పనిచేస్తుందని చెప్పి, అవతల వర్గం వారు పెద్దన్న కొడుకు 'ముని'కి వాటిని అందిస్తారు.
'ముని' వాటిని తీసుకుంటూ ఉండగా, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి గద్దలా వచ్చి వాటిని తన్నుకుపోతాడు. ఆ ప్రయత్నంలోనే పెద్దన్న కొడుకు 'ముని' ప్రాణాలు కోల్పోతాడు. తన కొడుకు 'ముని'ని ఎవరు చంపారు? తనకి దక్కవలసిన వెయ్యి కోట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను ఎత్తుకుపోయిందెవరు? తనకి వెంటనే తెలియాలని చెప్పి హిరానీ .. గౌరీతో పాటు ఇతర అనుచరులకు పెద్దన్న పురమాయిస్తాడు. వాళ్లంతా కూడా ఆ హెల్మెట్ వ్యక్తి ఎవరనేది తెలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక ఈ నేపథ్యంలోనే చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ పెరిగిన 'అర్జున్', ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉంటూ ఉంటాడు. మాటలు రాని అతను స్కూల్ డేస్ నుంచి 'కీర్తి' (అనశ్వర రాజన్)ని మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. తండ్రిలేని కీర్తి .. పూర్తిగా తల్లి పెంపకంలోనే పెరుగుతుంది. కీర్తిని అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నాలలో ఆమె ఉంటుంది. ఎలాగైనా కీర్తిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆమె బావ కిశోర్ (వెన్నెల కిశోర్) ఉంటాడు. ఒకసారి పనిపై కీర్తి తల్లి ఢిల్లీ వెళ్లిన సమయంలో, కీర్తికి అర్జున్ తో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సరదాగా బయటికి వెళ్లిన ఇద్దరూ, తమకి తెలియకుండానే 'వెయ్యికోట్ల' మేటర్లో చిక్కుకుంటారు. అందులో నుంచి వాళ్లు బయటపడతారా లేదా? అనేది మిగతా కథ.
చిన్నప్పటి నుంచి 'దొంగ' అనే ముద్ర పడిన కారణంగా, తన ఈడు పిల్లలకు అర్జున్ దూరమైపోతాడు. అయితే అప్పటి నుంచి అతను కీర్తిని మౌనంగా ఆరాధిస్తూ పెరుగుతాడు. పద్ధతి అనే పంజరంలో నుంచి బయటపడి స్వేచ్ఛాను అనుభవించాలనే ఆలోచనతో ఉన్న కీర్తి, అర్జున్ కి దగ్గరవుతుంది. తనకి దక్కవలసిన వెయ్యికోట్ల కోసం .. తన కొడుకు చావుకు కారణమైన వాళ్ల కోసం వెదుకుతున్న విలన్ కి, ఈ ఇద్దరూ కారకులుగా కనిపిస్తారు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
వెయ్యి కోట్లకి సంబంధించిన పెన్ డ్రైవ్ కోసం విలన్ గ్యాంగ్ వెదకడం .. ఆ పెన్ డ్రైవ్ కోసం గాలించే గ్రూపులు పెరుగుతూ పోవడం .. వాళ్లందరి బారి నుంచి తప్పించుకోవడానికి హీరో - హీరోయిన్ నానా తంటాలు పడటం వంటి అంశాలతో తెరపై కథ పరిగెడుతూ ఉంటుంది. ఇదంతా చదువుతూ ఉంటే, గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కదా అనిపిస్తుంది. నిజంగానే వచ్చాయి కూడా. కాకపోతే దర్శకుడు ట్రీట్మెంట్ తో ఇక్కడ కూర్చోబెట్టేస్తాడు. వెయ్యికోట్ల చుట్టూ ఒక ఆసక్తికరమైన దాగుడుమూతల ఆటను పరిగెత్తిస్తాడు.
వెయ్యికోట్ల కోసం మూడు బ్యాచ్ లు తీవ్రంగా గాలిస్తూ ఉండటం .. ఈ మూడు బృందాల నుంచి తప్పించుకునే టెన్షన్ లో హీరో - హీరోయిన్ ఉంటే, ఆ మధ్యలో హీరోయిన్ ను సొంతం చేసుకోవడం కోసం వెన్నెల కిశోర్ ప్రయత్నించడం కథకి మరింత వినోదాన్ని అద్దుతుంది. ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్టులు .. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది.
అనీష్ కి ఇది మొదటి సినిమా. అందువలన నటన పరంగా .. డాన్స్ పరంగా గట్టిగానే కష్టపడ్డాడు. మాటలు రాని అర్జున్ పాత్రలో మెప్పించడానికి ప్రయత్నించాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో .. డాన్సుల విషయంలో అతను ఇంకా చాలానే నేర్చుకోవలసి ఉంది. అనశ్వర రాజన్ ఆల్రెడీ తానేమిటన్నది ప్రూవ్ చేసుకున్నది గనుక, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ముఖేశ్ రుషి విలనిజం ఆడియన్స్ కి పరిచయమే.
ఇక ఈ సినిమా విషయంలో ఎక్కువ మార్కులు కొట్టేసేది తమన్ అని చెప్పాలి. ఆయన అందించిన బాణీలు బాగున్నాయి. 'అనగనగా ఆకాశంలో' .. ' ఉండిపో ఇలా నా గుండెలో' పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని చెప్పాలి. రాజా మహదేవన్ కెమెరా పనితనం .. కోటి ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలలను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది.
కథా పరంగా చూసుకుంటే రొటీన్ గానే అనిపిస్తుంది. కాకపోతే దర్శకుడు ఈ కథనాన్ని నడిపించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక ప్రేమకథకు వినోదాన్ని .. ఎమోషన్ ను .. యాక్షన్ ను ... కామెడీని కలిపి చెప్పిన తీరు ఆడియన్స్ మనసుకు పట్టుకుంటుంది. కట్టిపడేసే కలర్ ఫుల్ సాంగ్స్ తో పాటు, 'నేను సరిగ్గా స్నానమే చేయను .. ఇక మోసం ఎలా చేస్తాను సార్' వంటి వెన్నెల కిషోర్ డైలాగులు మరింత వినోదాన్ని పంచుతాయి. ఇది ఈ మధ్య కాలంలో రక్తపాతం లేకుండా రక్తి కట్టించిన సినిమా అనే చెప్పుకోవలసి ఉంటుంది.
Movie Details
Movie Name: Itlu Arjuna
Genre: Action, Comedy, Drama
Release Date: 13 Nov 2026
Cast: Aneesh, Anashwara Rajan, Mukhesh Rishi, Kumaravel, Kalai Yarasan, Brahmaji
Director: Mahesh Uppala
Music: Thaman
Banner: What Next Entertainments
Review By: Peddinti
Itlu Arjuna Rating: 2.75 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement