'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Advertisement
Pushpaka Vimanam Review
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలానే సినిమాలు .. సిరీస్ లు వచ్చాయి. అలాంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే 'పుష్పక విమానం'. సాయిరోనక్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి భరణి శంకర్ కీలకమైన పాత్రను పోషించాడు. సతీశ్ మల్లిడి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచే 'జియో హాట్ స్టార్' ఓటీటీ ట్రాక్ పైకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 4 ఎపిసోడ్స్ ను వదిలారు. ఇకపై ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ప్రేక్షకులను పలకరించనున్నాయి.
'పుష్పక్' (సాయి రోనక్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా వంటబట్టకపోయినా, మొత్తానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. మాటకారి కావడంతో పాలసీలు చేయించడంలో మిగతా వాళ్లకంటే చాలాముందుంటాడు. అతని స్పీడ్ ను అందుకోవడానికి మిగతా వాళ్లంతా నానా తిప్పలు పడుతుంటారు. జాబ్ తరువాత పుష్పక్ ఎక్కువగా ఆలోచన చేసేది 'సావిత్రి' (మధు దామరాజు) గురించే. ఆమె ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంటుంది.
'పుష్పక్' పై సావిత్రి చాలా కోపంగా ఉంటుంది. ఎనిమిదేళ్లుగా అతను ఎంతగా బ్రతిమాలుతున్నా ఆమె అలాగే భీష్మించుకుంటుంది. ఛాన్స్ ఉంటే గతంలోకి వెళ్లి, తాను చేసిన పొరబాటును సరిదిద్దాలని అతనికి ఉంటుంది. ఇక పుష్పక్ తమ్ముడు 'సంకేత్' కూడా 'సారా' ప్రేమలో ఉంటాడు. ఇద్దరూ కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. 'సారా' శ్రీమంతుల అమ్మాయి. అయినా సంకేత్ ధైర్యం చేసి, ఆమె తండ్రికి తమ ప్రేమ విషయం చెబుతాడు. అక్కడ జరిగిన అవమానంతో అతను కంగుతింటాడు. బాగా డబ్బు సంపాదించి తిరిగొస్తానని సవాల్ చేసి వెనుదిరుగుతాడు.
ఇక పుష్పక్ ఉంటున్న 'డార్విన్' కాలనీని ఖాళీ చేయించడానికి కొన్ని పెద్ద తలకాయలు ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్లకి సపోర్టుగా పోలీస్ ఆఫీసర్ 'ప్రభు' ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక అజ్ఞాత వ్యక్తి ( భరణి శంకర్) పుష్పక్ కి తారసపడతాడు. కాలనీ చివరో ఉన్న ఒక పాడుబడిన బిల్డింగ్ కి వెళ్లమని చెబుతాడు. అక్కడి 'లిఫ్ట్' అతని జీవితాన్ని మారుస్తుందని అంటాడు. ఆ మాటలను లైట్ తీసుకున్న పుష్పక్, అనుకోకుండానే ఆ రాత్రి అక్కడికి చేరుకుంటాడు.
ఆ లిఫ్ట్ కీ చాలా కాలం క్రితం ఆ ప్రదేశాన్ని తాకిన ఉల్కా శకాలానికి మధ్య సంబంధం ఉందనే సంగతి అతనికి తెలియదు. ఆ లిఫ్ట్ లోకి అడుగుపెడితే, అది తనని గతంలోకి తీసుకు వెళుతుందని కూడా అతనికి తెలియదు. గతంలోకి వెళ్లిన అతను ఏం చేస్తాడు? పుష్పక్ పై సావిత్రికి కోపం రావడానికి కారణం ఏమిటి? ఆ కాలనీని ఖాళీ చేయించాలనుకున్నవారిని పుష్పక్ ఎలా ఎదుర్కొంటాడు? ఒక వైపున తన ప్రేమకథపై దృష్టి పెడుతూనే, మరో వైపున తన తమ్ముడి ప్రేమకథను సక్సెస్ చేయడానికి పుష్పక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ.
జీవితం ఎప్పటికప్పుడు అనేక అనుభవాలతో .. జ్ఞాపకాలతో ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో తప్పులు .. పొరపాట్లు చేయనివారినంటూ ఎవరూ ఉండరు. ఆ తరువాత వాటిని తలచుకుని బాధపడని వారు కూడా ఉండరు. అలాంటి వాళ్లంతా కూడా కాలంలో వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే, ఆ పొరపాట్లను దిద్దుకోవాలని అనుకుంటారు. అయితే అరుదైన అలాంటి ఛాన్స్ దక్కించుకున్న కథానాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది.
హీరో ముందు కొన్ని సవాళ్లు ఉంటాయి. తాను ప్రేమించిన అమ్మాయిని కూల్ చేయాలి. తన ఫ్యామిలీ పొజీషన్ మార్చాలి .. తన తండ్రి గర్వపడేలా చేయాలి .. తన తమ్ముడి ప్రేమ కూడా సక్సెస్ అయ్యేలా చూడాలి .. తమ కాలనీని కాపాడుకోవాలి. ఇలా అనేక బాధ్యతలు హీరో భుజాలపై ఉంటాయి. ఆ బాధ్యతలను నిర్వహించడంలో అతనికి ఎదురయ్యే సవాళ్ల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
ఈ కథలో కీలకమైన అంశం హీరో .. లిఫ్ట్ లోకి అడుగు పెట్టడం. అది 4వ ఎపిసోడ్ చివర్లో జరుగుతుంది. అప్పటి వరకూ జరిగిన కథను చూసుకుంటే, పెద్దగా విషయం లేని సన్నివేశాలే కనిపిస్తాయని చెప్పాలి. హీరో పాత్ర చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ మిగతా పాత్రలు .. ట్రాకులు నిరాశగా ... నిరుత్సాహంగా సాగుతుంటాయి. అటు హీరో జాబ్ కి .. ఇటు చిటపటలాడే హీరో లవర్ గురించిన విషయాలతో కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.
హీరో ఆఫీసుకి సంబంధించిన సన్నివేశాలు గానీ .. ఫ్రెండ్ కాంబినేషన్లో హీరో సీన్స్ గాని పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే గ్రంథాలయం నడిపే అనంత నారాయణ పాత్ర వైపు నుంచి కూడా ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. ప్రధానమైన పాత్రలను పోషించిన వారు బాగానే చేశారు. సింగిల్ డైలాగ్ ఆర్టిస్టులకు సంబంధించిన సీన్స్ కృతకంగా అనిపిస్తాయి. ఆ విషయంలో శ్రద్ధ పెడితే బాగుండేదేమో. అలాగే భరణి శంకర్ పాత్రను కూడా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించవలసిందేమో అనిపిస్తుంది.
సాయితేజ ఫొటోగ్రఫీ .. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం .. సాజత్ అలీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఈ 4 నాలుగు ఎపిసోడ్స్ వరకూ చూసుకుంటే, కథాకథనాలలో కొత్తదనం కనిపించలేదు. పాత్రలు కూడా విభిన్నంగా .. విలక్షణంగా మలచడానికి తగిన ప్రయత్నాలు జరగలేదని అనిపిస్తుంది. అయితే ఇంకా రావలసిన ఎపిసోడ్స్ ఉన్నాయి గనుక, ఆ ఎపిసోడ్స్ ను ఆవిష్కరించే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ సిరీస్ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పచ్చు.

Series Details
Series Name: Pushpaka Vimanam
Genre: Drama, Sci-Fi
Release Date: 12 Nov 2026
Cast: Sai Ronak, Madhu Damaraju, Vadlamani Srinivas, Raghu Kumar
Director: Satish Reddy Mallidi
Music: Priyadarshan Balasubramaniyan
Banner: Global Creations
Review By: Peddinti
Pushpaka Vimanam Rating: 2 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement