ap7am logo

'RDX Love' మూవీ రివ్యూ

Fri, Oct 11, 2019, 04:51 PM
Movie Name: 'RDX Love'
Release Date: 11-10-2019
Cast: Tejus Kancherla, Payal, Naresh, Aamani, Aaditya Menon,Tulasi,Mumaith Khan
Director: Shankar Bhanu
Producer: C. Kalyan
Music: Radhan
Banner: Happy Movies

ఊరు కోసం .. ఊరు జనాల బాగు కోసం తన శీలాన్ని పణంగా పెట్టిన ఓ అందమైన యువతి కథ ఇది. ఆ ఊరు సమస్యని పరిష్కరించడం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన అలివేలు కథ ఇది. రొమాంటిక్ లవ్ స్టోరీగా కనిపించే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో, శృంగారం - ఆదర్శం అనే రెండు అతకని అంశాలను కలిపి చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు మాత్రమే ఫలించిందని చెప్పాలి. 

పుట్టిపెరిగిన ఊరుపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉంటుంది. తమ ఊరుకి మంచి చేయడం కోసం తమ జీవితాలను త్యాగం చేసినవాళ్లు ఎంతోమంది వున్నారు. ఈ తరహాలో తెరపైకి వచ్చిన కథలు ఎన్నో వున్నాయి. అదే తరహా కథకు కొంత రొమాన్స్ ను జోడించి అందించడానికి దర్శకుడు శంకర్ భాను చేసిన ప్రయత్నంగా 'ఆర్డీఎక్స్ లవ్' కనిపిస్తుంది. అందాల కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన పాయల్, తొలిసారిగా చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది ఒకసారి పరిశీలిద్దాం.

ఈ కథ 'చంద్రన్నపేట' అనే ఓ మారుమూల పల్లెటూళ్లో మొదలవుతుంది. ఆ గ్రామంతో పాటు మరో 40 గ్రామాలు 'నది'కి ఇవతల వైపున ఉంటాయి. చదువుకుగానీ .. హాస్పిటల్ కి గాని వెళ్లాలంటే 200 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయవలసిందే. అందువల్లనే వాళ్లంతా ఆ నదిపై 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించమని ముఖ్యమంత్రి బాపినీడు(నాగినీడు) తో మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోతుంది.

ఆ సమస్యను చూస్తూనే అలివేలు (పాయల్) పెద్దదవుతుంది. ప్రభుత్వ పథకాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తూనే, తన ఊరు సమస్యను పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అలివేలు ప్రేమలోపడిన సిద్ధూ (తేజుస్) ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. శ్రీమంతుడైన ఆయన తండ్రి గిరిప్రకాశ్ నారాయణ్ (ఆదిత్యమీనన్)కి ఇది ఎంతమాత్రం నచ్చదు. దాంతో ఆయన అలివేలును అడ్డుతప్పించాలనుకుంటాడు. అప్పటి నుంచి కథ అనేక మలుపులు తీసుకుంటుంది.

టైటిల్ ను బట్టి .. పాయల్ రాజ్ పుత్ కి గల క్రేజ్ ను బట్టి, దర్శకుడు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీనే చెబుతాడని ప్రేక్షకులు అనుకుంటారు. ఆ తరహా సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆ రొమాన్స్ వెనుక ఒక ఆదర్శవంతమైన ప్రయోజనాన్ని ఆవిష్కరించడానికి ఆయన ప్రయత్నించాడు. అయితే ఈ రెండూ పొసగని అంశాలను ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు.

సీతారాముల విగ్రహాలపై ఎమోషనల్ గా సీన్ ఓపెన్ చేసిన దర్శకుడు, ఆ వెంటనే వినకూడని మాటలను అంటూ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక ఆదర్శవంతమైన ఆశయంతో అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి హీరోయిన్ ఎంచుకున్న మార్గం సరైనది కాదనిపిస్తుంది. యూత్ ను అలరించడం కోసమన్నట్టుగా ఆ పాత్రతో కొన్ని రకాల పనులు చేయించడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా క్లుప్తంగా చెప్పాల్సిన విషయాలను కూడా ఆయన సాగదీస్తూ సన్నివేశాలుగా రాసుకుని అసహనాన్ని కలిగించాడు.

ఇక 'ఆమని' వంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కీలకమైన సన్నివేశంలో ఆ పాత్ర చెప్పే నాలుగు డైలాగ్స్ ను కూడా పవర్ఫుల్ గా రాసుకోలేకపోయాడు. హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచి ఆమె కూడా తిరిగేవారు ఆమె ఏజ్ గ్రూప్ వారు కాకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది. వంతెన నిర్మాణం కోసం సీతారాముల విగ్రహాలను వేరు చేయడం ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. హాస్టల్ వార్డెన్ గా 'గే' పాత్రలో చమ్మక్ చంద్ర చేత, లేడీ కానిస్టేబుల్ గా విద్యుల్లేఖ తోను చేయించిన కామెడీ పేలలేదు. రొమాంటిక్ సీన్స్ విషయంలో .. సాంగ్స్ విషయంలో మాత్రం దర్శకుడు ఎక్కువ మార్కులనే సంపాదించుకుంటాడని చెప్పాలి.

సిద్ధూ పాత్రలో తేజుస్ ప్రేక్షకులను మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కడా కూడా హీరోగా మాత్రం అనిపించడు. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కనుక ఓకే అని సరిపెట్టుకోవాలంతే. ఇక అలివేలు పాత్రలో పాయల్ చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ లో ఆమె మరింత గ్లామరస్ గా మెరిసింది. అలివేలు పాత్రతో తలపడే ప్రతినాయక పాత్రలో ఆదిత్య మీనన్ చాలా సహజంగా నటించాడు. పాయల్ తల్లిగా తెరపై తులసి కనిపించింది కాసేపే అయినా తన మార్కును చూపించింది. రెండే సీన్లు అయినా పోలీస్ ఆఫీసర్ గా ముమైత్ ఖాన్ బాగా చేసింది. ఇక సీనియర్ నరేశ్ .. ఆమని .. నాగినీడు పాత్రలకు ఎలాంటి ప్రత్యేకతగానీ .. ప్రాధాన్యతగాని కనిపించదు.

రధన్ అందించిన బాణీల్లో 'ఒరబ్బీ కొంగేజారిందంటే' .. 'నీ నఖ శిఖలే' ఆకట్టుకునేలా వున్నాయి. రామ్ ప్రసాద్ ఫొటో గ్రఫీ బాగుంది. పాయల్ ను ఆయన ఈ సినిమాలో చాలా అందంగా చూపించాడు. ముఖ్యంగా 'నీ నఖ శిఖలే' పాటలో తెరపై నుంచి ఆయన ఎవరినీ చూపు తిప్పుకోకుండా చేశాడు. రొమాంటిక్స్ సీన్స్ తో పాటు .. రెయిన్ ఎఫెక్ట్ లోని ఎమోషనల్ సీన్ చిత్రీకరణలోను ఆయన పనితనం కనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ట్రాఫిక్ పోలీస్ సీన్ .. సిద్ధు గర్ల్ ఫ్రెండ్ డ్రామా సీన్ .. చమ్మక్ చంద్ర 'గే' సీన్ .. 'కామసూత్ర'పై పల్లె ప్రజలకి అవగాహన కల్పించే ఎపిసోడ్ .. గుట్కా మాన్పించే ఎపిసోడ్ .. రౌడీలతో అలివేలు టీమ్ ను కబడ్డీ ఆడించే సీన్లలో కొన్ని ఎత్తేసి, మరికొన్ని ట్రిమ్ చేయవచ్చు. రీ రికార్డింగ్ ఫరవాలేదు .. గణేశ్ స్వామి కొరియోగ్రఫీ బాగుంది.

రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తుంది. రొమాన్స్  వైపు నుంచి ఎమోషన్ వైపు వెళ్లడం యూత్ కి కొంత నిరాశను కలిగిస్తుంది. ఈ మధ్యలో పేలవమైన .. అనవసరమైన సన్నివేశాలు ఉండనే వున్నాయి. ఈ కారణాలుగానే, సంగీతం .. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ సపోర్ట్ చేసినా ఈ సినిమా యూత్ ను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.        

Review By: Peddinti
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
'ఎంత మంచివాడవురా' మూవీ రివ్యూ
బాల్యంలోనే బాలు ఓ ప్రమాదంలో తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. తనకి ఆశ్రయం కల్పించవలసి వస్తుందేమో అన్న ఉద్దేశంతో బంధువులంతా ముఖం చాటేయడం అతనికి బాధ కలిగిస్తుంది. తనలా అయినవారి ప్రేమకి దూరమైనవారికి ఆ లోటు తెలియకుండా ప్రేమను అందించాలనే ఆలోచనతో బాలు రంగంలోకి దిగుతాడు. పర్యవసానంగా అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేదే కథ. భవిష్యత్తు తరాలవారికి అందించవలసింది ఆస్తిపాస్తులు కాదు, బంధాలు .. అనుబంధాలు అనే సందేశంతో రూపొందిన ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు.
'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక తండ్రి, తన కొడుకును శ్రీమంతుడిగా చూసుకోవాలనే స్వార్థంతో, పురిటిలోనే బిడ్డలను మారుస్తాడు. అలా మధ్యతరగతికి చెందిన ఆ బిడ్డ శ్రీమంతుల కుటుంబంలో పెరుగుతాడు. శ్రీమంతుల బిడ్డ మధ్యతరగతి ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఎదుగుతాడు. ఈ నిజం ఎలా బయటపడుతుంది? ఎప్పుడు బయటపడుతుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ
దేశ సరిహద్దుల్లో శత్రువుల దాడిని తిప్పికొట్టే మేజర్ అజయ్ కృష్ణ, ప్రొఫెసర్ భారతి కుటుంబానికి అండగా నిలబడవలసి వస్తుంది. అందుకోసం అతను కశ్మీర్ నుంచి కర్నూల్ వస్తాడు. భారతి కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న మినిస్టర్ నాగేంద్రకు ఎదురు తిరుగుతాడు. ప్రొఫెసర్ భారతికి .. మినిస్టర్ నాగేంద్రకి మధ్య వైరానికి గల కారణం ఏమిటి? భారతికి సపోర్ట్ గా నిలిచిన అజయ్ కృష్ణకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అజయ్ కృష్ణ ఎలా నాగేంద్ర ఆటకట్టించాడు? అనేది కథ. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో కలిపి అల్లిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
'దర్బార్' మూవీ రివ్యూ
డ్రగ్స్ మాఫియా గుప్పెట్లో వున్న యువతను కాపాడటమే ధ్యేయంగా ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో తన ఒక్కగానొక్క కూతురును కోల్పోతాడు. అందుకు కారణమైన మాఫియా లీడర్ ను ఆదిత్య అరుణాచలం ఎలా అంతం చేశాడు? అందుకోసం ఎలాంటి వ్యూహాలను ఛేదించాడు? అనేదే కథ. సాధారణమైన కథే అయినా మురుగదాస్ తనదైన స్టైల్లో చెప్పిన తీరు వలన, రజనీ లుక్ .. స్టైల్ కారణంగా ఈ సినిమా ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది. 
'తూటా' మూవీ రివ్యూ
'రఘు' చిన్నతనంలోనే ఆయన అన్నయ్య ఇల్లొదిలిపోతాడు. ఇంజనీరింగ్ చదువుతున్న రఘు .. సినిమాల్లో నటించే 'లేఖ' ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వలన రఘుకి దూరమైన ఆమె, కొంతకాలం తరువాత రఘుకి కాల్ చేస్తుంది. రఘు అన్నయ్యను గురించిన ఒక రహస్యం చెబుతుంది. అదేమిటి? లేఖతో పాటు అన్నయ్యను రక్షించుకోవడం కోసం రఘు ఏం చేస్తాడు? అనేవి మిగతా కథ. ఫస్టాఫ్ లో కథ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. సెకండాఫ్ లో కొంత అర్థమైనప్పటికీ, ఆశించినస్థాయిలో లేని ముగింపు అసంతృప్తిని కలిగిస్తుంది.
'మత్తు వదలరా' మూవీ రివ్యూ
ఆర్థికపరమైన సమస్యలతో ముగ్గురు స్నేహితులు ఇరుకైన ఒక చిన్న గదిలో వుంటూ నానా కష్టాలు పడుతుంటారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న కథానాయకుడు ఒక ఐటమ్ ను అందజేయడానికి ఒక ఫ్లాట్ కి వెళతాడు. అక్కడ జరిగే అనూహ్యమైన సంఘటనతో కథ మలుపు తిరుగుతుంది. ఆ సంఘటన ఏమిటి? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే మిగతా కథ. ఫస్టాఫ్ లో కథ కాస్త నెమ్మదించినా, ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకుంటుంది.
'ఇద్దరి లోకం ఒకటే' మూవీ రివ్యూ
ప్రేమలో పడిన తరువాత కొన్ని సంఘటనలు అందమైన జ్ఞాపకాలుగా .. అనిర్వచనీయమైన అనుభూతులుగా మారతాయి. అయితే కొంతమంది విషయంలో చిన్ననాటి అందమైన జ్ఞాపకాలు .. అనుభూతులే ప్రేమగా మారతాయి. అలా రెండో కోవకి చెందిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఇద్దరి లోకం ఒకటే'. ఒక చిన్నపాయింట్ పట్టుకుని మొదటి నుంచి చివరివరకూ సాగదీసిన ఈ కథ, ప్రేక్షకుల సహనానికి మాత్రం పరీక్ష పెడుతుంది! 
'రూలర్' మూవీ రివ్యూ
ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు రైతులు .. అక్కడ వారికి ఎదురైన కష్టాలు .. ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లను ఆదుకున్న కథానాయకుడి కథ ఇది. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను ధరించిన ఈ సినిమా, నిర్మాణం పరంగా భారీగా కనిపిస్తుందిగానీ, కథాకథనాలపరంగా బలహీనంగా అనిపిస్తుంది. అతకని సన్నివేశాలతో అసంతృప్తిని కలిగిస్తుంది.
'ప్రతిరోజూ పండగే' మూవీ రివ్యూ
కన్నతండ్రి ప్రాణాలకంటే ఉద్యోగాలే ఎక్కువనుకునే కొడుకులు ఒక వైపు .. చివరి క్షణాల్లో కొడుకులతో కలిసి ఉండటమే పండగ అనుకునే తండ్రి ఒక వైపు. ఆ కొడుకుల ఆలోచనా విధానాన్ని మార్చి .. ఆ తండ్రి ముచ్చట తీర్చే ఒక మనవడి కథే ఇది. బలమైన ఎమోషన్స్ తో తాతా మనవళ్ల చుట్టూ తిరుగుతూ, అందమైన ప్రేమను .. ఆహ్లాదకరమైన కామెడీని టచ్ చేస్తూ సాగే ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
'వెంకీమామ' మూవీ రివ్యూ
మేనల్లుడి ఆలనా పాలన చూసుకోవడం కోసం పెళ్లి చేసుకోవడం మానేసిన మేనమామ ఒక వైపు. ఆ మేనమామ కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిన మేనల్లుడు మరో వైపు. ఈ రెండు పాత్రలు ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది.
'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' మూవీ రివ్యూ
ఒక వైపున షార్ట్ ఫిల్మ్స్ లో నటించే ముగ్గురు స్నేహితులు .. మరో వైపున డ్రగ్స్ ను అక్రమంగా తరలించే మాఫియా ముఠా .. వాళ్ల రహస్యాలకి సంబంధించిన ఆధారాలతో తప్పించుకు తిరిగే యువతి .. ఆ ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. కసరత్తు చేయని కథతో .. పై పై అల్లేసిన కథనంతో చుట్టేసిన ఈ సినిమా అలరించడం సంగతి అటుంచితే, గందరగోళానికి గురిచేయడంలోనే సక్సెస్ అయింది.
'మిస్ మ్యాచ్' మూవీ రివ్యూ
రెండు ప్రాంతాలు .. రెండు కుటుంబాలు .. వేరు వేరు స్వభావాలు .. అయినా ఒకటి కావాలని ఆరాటపడే రెండు మనసులు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంటకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనేది కథ. ఆసక్తికరంగా అనిపించని కథాకథనాలతో ఆద్యంతం ఈ సినిమా నీరసంగా సాగుతుంది .. అనూహ్యమైన మలుపులనేవి లేకుండా అసహనానికి గురిచేస్తుంది. 
'90 ఎంఎల్' మూవీ రివ్యూ
మూడు పూటలా 90 ఎం.ఎల్ మందు తాగనిదే ఉండలేని ‘దేవదాసు’, మందు వాసన తమ గేటు బైట ఉండగానే పసిగట్టే ‘సువాసన’ను ప్రేమిస్తాడు. తన ఈ అలవాటును కప్పిపుచ్చుకుంటూ కథానాయికతో ప్రేమను కొనసాగిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో దేవదాసు నిత్య తాగుబోతు అని తెలుసుకున్న కథానాయిక అతనికి దూరం అవుతుంది. ప్రియురాలికి నిజం చెప్పి ఆమె ప్రేమను ఎలా తిరిగి పొందగలిగాడు అనేది కథ. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం ఆ వర్గానికి నచ్చే అంశాలతో రూపొందింది.
'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ
రాణిపట్ల తన మనసులోని ప్రేమను బయటపెట్టలేక రాజా మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. కాలేజ్ చదువు కోసం ఊరెళ్లిన రాణి తిరిగిరాగానే ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పాలనుకుంటాడు. ఈ లోగా రాణి తండ్రి ఆమెను తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అప్పుడు రాజా ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే కథ. పస లేని కథ ..పట్టులేని కథనంతో ఈ పల్లెటూరి ప్రేమకథ ఆకట్టుకోలేకపోయింది.
'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ
నకిలీ సర్టిఫికెట్లకి సంబంధించిన వ్యాపారం కోట్ల రూపాయల్లో కొనసాగుతూ ఉంటుంది. ఆ మాఫియా దెబ్బకి 'అర్జున్ సురవరం' అనే రిపోర్టర్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దాంతో ఆ మాఫియాకి అడ్డుకట్టవేయడానికి అతను రంగంలోకి దిగుతాడు. పర్యవసానంగా అతనికి ఎదురయ్యే పరిస్థితులతో ఈ కథ సాగుతుంది. బలమైన కథాకథనాలతో .. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ
జీవితానికి అందాన్నిచ్చేది .. జీవితానికో అర్థాన్నిచ్చేవి బంధాలు - అనుబంధాలేనని నమ్మే వ్యక్తి సోమరాజు. తన కుటుంబ సభ్యులంతా సఖ్యతగా ఉన్నారని భావించిన ఆయనకి, అందులో నిజంలేదనే విషయం తన మరణం తరువాత తెలుస్తుంది. ఆత్మగా వున్న ఆయన, వాళ్లలో మార్పు తీసుకురావడం కోసం ఏం చేశాడనేదే కథ. మూడు తరాలకి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి సాగే ఈ కథ ఫరవాలేదనిపిస్తుంది.
'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ
అనాథశరణాలయంలో పెరిగిన 'విద్య'ను, శ్రీమంతుడైన రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి జరిగిన కొంతకాలానికే అతను హత్యకి గురవుతాడు. ఆ హత్యకి కారకులు ఎవరు? ఎందుకు అతణ్ణి హత్య చేయవలసి వచ్చింది? అనేదే కథ. ఆద్యంతం అనూహ్యమైన మలుపులతో సాగే ఈ కథ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఫరవాలేదనిపిస్తుంది. 
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
ఉస్మానియా యూనివర్సిటీలో 'జార్జి రెడ్డి' చదువుకునేటప్పుడు వున్న సమస్యలు, వాటి పరిష్కారానికై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తూ ఆయన పోరాట శంఖం పూరించిన తీరుతో ఈ కథ నడుస్తుంది. ఆ కాలంనాటి కాస్ట్యూమ్స్ విషయంలో కొంత ఇబ్బంది పడినట్టుగా అనిపించినా, సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన సన్నివేశాలతో ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
'విజయ్ సేతుపతి' మూవీ రివ్యూ
పచ్చదనానికీ .. మంచితనానికి ప్రతీకగా కనిపించే పల్లెటూరు అది. ఆ ఊరు బాగు కోసం తపించే దేవరాజ్ కొడుకే విజయ్ సేతుపతి. రాజకీయనాయకుడైన చంటబ్బాయ్ .. పారిశ్రామికవేత్త అయిన సంజయ్ కలిసి ఆ ఊళ్లో 'కాపర్ ఫ్యాక్టరీ' పెట్టాలనుకుంటారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కారణంగా తన తల్లిదండ్రులనీ, కాబోయే భార్యని విజయ్ సేతుపతి పోగొట్టుకుంటాడు. ఆ తరువాత ఆయన ఏం చేస్తాడు? అనేదే కథ. ఏ మాత్రం కొత్తదనం లేని ఈ కథ సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. 
'యాక్షన్' మూవీ రివ్యూ
ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆర్మీ ఆఫీసర్ సుభాశ్, ఒకానొక సంఘటనలో తాను ప్రేమించే అమ్మాయినీ .. తనని ప్రేమించే అన్నయ్యను పోగొట్టుకుంటాడు. తమ కుటుంబ సభ్యుల కారణంగానే కాబోయే ప్రధాని కూడా చనిపోయాడనే నిందను భరించలేకపోతాడు. ఆ సంఘటన వెనక ఎవరున్నారో తెలుసుకుని చట్టానికి అప్పగించి, తన కుటుంబ పరువు ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం సుభాశ్ చేసే ప్రయత్నమే ఈ కథ. 
'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మూవీ రివ్యూ
రాజకీయంగా తన ఎదుగుదలకి వరలక్ష్మి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో, సింహాద్రినాయుడు ఆమెను ఓ హత్య కేసులో ఇరికిస్తాడు. లాయర్ తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో, నిందితురాలైన వరలక్ష్మిని నిర్దోషిగా నిరూపిస్తాడు. ఆ తరువాత తెలిసిన నిజంతో బిత్తరపోతాడు. ఆ నిజం ఏమిటి? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.
'తిప్పరా మీసం' మూవీ రివ్యూ
చిన్నతనంలోనే చెడు బాట పట్టిన కొడుకు .. అతనితో పాటే పెరుగుతూ వచ్చిన వ్యసనాలు. అతను మంచి మార్గంలోకి అడుగుపెట్టే రోజు కోసం ఎదురుచూసే తల్లి. ఆమె ప్రేమకి ద్వేషాన్ని ఫలితంగా ముట్టజెప్పే కొడుకు. ఇలా తల్లీకొడుకుల మధ్య నడిచే కథ ఇది. ప్రధానమైన కథకు వినోదపరమైన మిగతా అంశాలను జోడించకపోవడం వలన, ఈ సినిమా ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.
'ఏడు చేపల కథ' మూవీ రివ్యూ
ఒక వైపున ఆత్మల ఆవాహన .. మరో వైపున అరుదైన వ్యాధితో బాధపడే హీరో బృందం .. ఇంకో వైపున తనకి తెలియకుండానే తాను ఎలా గర్భవతినయ్యాననే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించే హీరోయిన్. ఇలాంటి ముఖ్యమైన అంశాలను ముడివేసుకుంటూ వెళ్లిన కథే .. 'ఏడు చేపల కథ'. అడల్ట్ కంటెంట్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఓ మాదిరిగా అనిపించడం కష్టమేనేమో.
'ఆవిరి' మూవీ రివ్యూ
రాజ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురును పోగొట్టుకున్న ఆ దంపతులు, ఆ జ్ఞాపకాలకు దూరంగా వేరే ఇంటికి మారతారు. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి చిన్నకూతురి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఓ రాత్రివేళ హఠాత్తుగా ఆ అమ్మాయి అదృశ్యమవుతుంది. అందుకు కారకులు ఎవరు? అసలా ఇంట్లో ఏం జరుగుతోంది? అనే మలుపులతో 'ఆవిరి' సినిమా సాగుతుంది. ఆసక్తికరమైన కథనం కారణంగా ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ తరహా కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.
'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ
తనకి కాబోయే భర్త నిజాయితీ పరుడై, ఎలాంటి వ్యసనాలు లేనివాడై వుండాలని కోరుకునే యువతి ఒక వైపు, తన గురించిన ఒక విషయం ఆమెకి తెలిస్తే తమ పెళ్లి ఆగిపోతుందనే ఉద్దేశంతో ఒక యువకుడు పడే పాట్లు మరో వైపు. కథ అంతా కూడా ఈ అంశం చుట్టూనే తిరుగుతుంది. అక్కడక్కడా మాత్రమే నవ్వించే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
Mukha Mukhi with Jwala Gutta..
Mukha Mukhi with Jwala Gutta
9 PM Telugu News: 18th January 2020..
9 PM Telugu News: 18th January 2020
Reasons Behind CM YS Jagan Different Stand On AP Capital- ..
Reasons Behind CM YS Jagan Different Stand On AP Capital- Weekend Comment By RK
JC Diwakar Reddy Sensational Comments on CM YS Jagan..
JC Diwakar Reddy Sensational Comments on CM YS Jagan
CM YS Jagan And CM KCR Meeting Over AP Capital Issue- Week..
CM YS Jagan And CM KCR Meeting Over AP Capital Issue- Weekend Comment By RK
High Power Committee Green Signal To AP Capital Shift ?..
High Power Committee Green Signal To AP Capital Shift ?
CPI Narayana in Encounter With Murali Krishna..
CPI Narayana in Encounter With Murali Krishna
Will YSRCP package help Amaravati farmers in any way?..
Will YSRCP package help Amaravati farmers in any way?
KTR Road Show At Sircilla LIVE- TS Municipal Elections..
KTR Road Show At Sircilla LIVE- TS Municipal Elections
Sarileru Neekevvaru Hit Promo- Mahesh Babu, Rashmika..
Sarileru Neekevvaru Hit Promo- Mahesh Babu, Rashmika