KCR: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలపై కేసీఆర్ కామెంట్స్

KCR Comments on Recent Panchayat Elections in Telangana
  • ఇటీవల తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల విజయం
  • పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగి ఉంటే బీఆర్ఎస్ సత్తా తెలిసేదని వ్యాఖ్యానించారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకార ధోరణి ప్రదర్శించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. 
KCR
KCR comments
Telangana Panchayat Elections
BRS Party
Telangana Bhavan
Congress MLAs
Telangana Politics
BRS Victory

More Telugu News