Prathipati Pulla Rao: పవన్‌తో సినిమా తీసే ఛాన్స్ వచ్చింది... కానీ!: ప్రత్తిపాటి పుల్లారావు

Prathipati Pulla Rao Reveals Chance to Make Movie with Pawan Kalyan
  • తాను పవన్‌కు పెద్ద అభిమానిని అన్న పత్తిపాటి పుల్లారావు
  • పవన్‌తో సినిమా తీయాలని భావించానని వెల్లడి
  • అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానన్న మాజీ మంత్రి
చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానినని, ఆయనతో ఒక సినిమా కూడా తీయాలని భావించానని మనసులో మాట బయటపెట్టారు. అయితే, అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. "నేను పవన్ అభిమానిని. ఆయనతో సినిమా తీయాలని అనుకున్నాను, అడిగిన వెంటనే అవకాశం కూడా లభించింది... అడిగిన వెంటనే ఒప్పుకున్నారు... కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేశాను" అని తెలిపారు.

అనంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పుల్లారావు స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారి కృష్ణతేజ చిలకలూరిపేటలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల విలువైన స్థలాలను విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

తల్లిదండ్రులు ఇలాంటి సమావేశాల ద్వారా పిల్లల చదువుపై మరింత అవగాహన పెంచుకోవచ్చని ప్రత్తిపాటి సూచించారు.
Prathipati Pulla Rao
Pawan Kalyan
Chilakaluripeta
MLA
Movie Chance
Deputy CM
Andhra Pradesh Politics
Mega Parent Teacher Meeting
Palnadu District
Krishna Teja IAS

More Telugu News