Petrol Bunk: ఏపీలో పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఈసీ కీలక ఆదేశాలు

EC issues orders to Petrol Bunks owners in AP
  • ఓట్ల లెక్కింపు ముగిసేదాకా సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దన్న ఈసీ
  • పౌర సరఫరాల శాఖ ద్వారా నోటీసులు
  • నిబంధనలు అతిక్రమిస్తే బంకుల లైసెన్స్ రద్దు  చేస్తామని హెచ్చరిక

ఏపీలో పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున... సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ బంకుల యజమానులకు నోటీసులు పంపింది. నిబంధనలు అతిక్రమిస్తే పెట్రోల్ బంకుల లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించింది. 

దీనిపై ఇంధన డీలర్ల సమాఖ్య సానుకూలంగా స్పందించింది. ఈసీ, పౌర సరఫరాల శాఖ ఆదేశాలను పెట్రోల్ బంకులన్నీ విధిగా అమలు చేయాలని కోరింది. పల్నాడు జిల్లాలో ఇటీవల పోలీసుల తనిఖీల్లో పెద్దమొత్తంలో పెట్రోల్ బాంబులు లభ్యమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News