Raghu Rama Krishna Raju: సజ్జల కళ్లలో భయం కనపడుతోంది.. పులివెందుల కూడా టైట్ గా ఉంది: రఘురామకృష్ణరాజు

No wonder if Kutami gets more than 150 seats says Raghu Rama Krishna Raju
  • వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్న రఘురాజు
  • కూటమికి 150 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్య
  • పులివర్తి నానిపై దాడిని ఖండించిన రఘురాజు

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఉండి అభ్యర్థి, ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓటమి భయంతోనే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. సజ్జలతో పాటు వైసీపీ నేతల కళ్లలో భయం కనపడుతోందని వ్యాఖ్యానించారు. నోరు అబద్ధం చెప్పినా, కళ్లు అబద్ధం చెప్పవని అన్నారు. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తాను ఇంతకు ముందే చెప్పానని... ఆ సంఖ్య 150 సీట్లు దాటినా తాను ఆశ్చర్యపోనని చెప్పారు. గతంలో జగన్ కు 110 వస్తాయని అనుకుంటే 151 వచ్చాయని... దీన్ని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నారు. ఈ మెజార్టీని జగన్ కూడా ఊహించలేక పోయారని చెప్పారు. 

ఉద్యోగుల ఓటింగ్ 85 శాతం పడిందని చెపుతున్నారని... అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని రఘురాజు తెలిపారు. పులివెందులే టైట్ గా ఉందంటే... ఇక ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని ఖండించారు. నానిని పరామర్శించేందుకు ఆయన వెళ్లారు.

  • Loading...

More Telugu News