Mahesh Babu: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై వస్తున్న రూమర్స్ కు ముగింపు పలికిన నిర్మాణ సంస్థ

Production house of Mahesh Babu movie gives clarity
  • సినిమా క్యాస్టింగ్ పై ఆంగ్ల వెబ్ సైట్ లో కథనాలు వచ్చాయన్న శ్రీ దుర్గ ఆర్ట్స్
  • క్యాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి సినిమాలో భాగమైనట్టు రాశారని వెల్లడి
  • ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.  

రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది. కొన్ని ఇంగ్లీష్  వెబ్ సైట్స్ లో వెలువడిన కథనాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పింది. క్యాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి తమ సినిమాలో భాగమైనట్టు రాశారని... ఇందులో నిజం లేదని తెలిపింది. తమ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని... తమ అధికారిక ప్రకటనను తప్ప ఇతర అప్ డేట్స్ ను నమ్మొద్దని సూచించింది.

  • Loading...

More Telugu News