Cricket: భారీ వర్షంతో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్... ఉప్పల్ స్టేడియంలో లైట్స్ అండ్ మ్యూజిక్ షో... వీడియో ఇదిగో!

Lights and music show at uppal stadium
  • హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌ కోసం నిండిపోయిన ఉప్పల్ స్టేడియం
  • భారీ వర్షంతో మ్యాచ్ ఆగిపోవడంతో లైట్స్ అండ్ మ్యూజిక్ షో
  • నాటు నాటు సాంగ్‌కు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టిన అభిమానులు

హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఇలాగే కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశముంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు స్టేడియం ఫుల్ అయింది. మ్యాచ్ నిలిచిపోవడంతో అభిమానులు గంటలకొద్దీ స్టేడియంలో ఉండవలసి వచ్చింది.

ఈ సమయంలో వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియంలో కాసేపు లైట్స్ అండ్ మ్యూజిక్ షో ప్రదర్శించారు. ఇది క్రికెట్ అభిమానులను అలరించింది. 'నాటు నాటు' సాంగ్‌కు అనుగుణంగా వేసిన లైటింగ్‌కు అందరూ ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News