AP Violence: ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన సీఎస్, డీజీపీ

CS and DGP attends before EC in New Delhi
  • ఏపీలో పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత రోజు హింసాత్మక ఘటనలు
  • సీఎస్, డీజీపీలపై ఈసీ ఆగ్రహం!
  • స్వయంగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఇరువురికి ఆదేశాలు

ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత కూడా హింస కొనసాగుతుండడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించింది. 

ఈసీ ఆదేశాల నేపథ్యంలో సీఎస్, డీజీపీ నేడు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల సంఘం ముందు వ్యక్తిగతంగా హాజరైన జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్రంలో పరిస్థితులపై వివరణ ఇచ్చారు. 

ఏపీలో పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం హింసను అరికట్టడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార సరళిపై ముందు నుంచే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలను ఈసీ ఆదేశించడం ఏపీలో పరిస్థితికి అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News