Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరిక!

Heavy Rain in Hyderabad
  • భాగ్య‌నగరంలో ఒక్కసారిగా చల్లబడిన‌ వాతావరణం
  • రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్న‌ వాతావరణ శాఖ
  • వ‌ర్షం కార‌ణంగా న‌గ‌రంలో ప‌లుచోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. 

ప్ర‌స్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తార్నాక, బేగంపేట్, అల్వాల్‌, ఉప్పల్, రాంనగర్‌, కోఠి,  మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, బేగంబజార్‌, హైటెక్‌సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వ‌ర్షం కార‌ణంగా న‌గ‌రంలో ప‌లుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

  • Loading...

More Telugu News