Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Huge rush continues in Turumala
  • భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు
  • ఏటీజీహెచ్ వరకు విస్తరించిన క్యూ లైన్
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.3.90 కోట్ల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ ఉదయానికి క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

నిన్న (బుధవారం) స్వామివారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. తిరుమల వెంకన్నకు నిన్న ఒక్క రోజే హుండీ ద్వారా రూ.3.90 కోట్ల ఆదాయం లభించింది.

  • Loading...

More Telugu News