Somireddy Chandra Mohan Reddy: 135 స్థానాల్లో కూటమి గెలుస్తుంది: సోమిరెడ్డి

TDP will win in 135 seats says Somireddy
  • ఏపీలో ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందన్న సోమిరెడ్డి
  • ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగాయని వ్యాఖ్య
  • ఐఏఎస్ లు, ఐపీఎస్ లను జగన్ కూలీలుగా మార్చారని విమర్శ

ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. జగన్ కు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరానికి మధ్య జరిగినవని చెప్పారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని అన్నారు. 

దాడులకు పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని లేదంటే జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడని... ఐఏఎస్, ఐపీఎస్ లను కూలీల కింద మార్చారని విమర్శించారు. శాసన సభలో తీసుకున్న నిర్ణయాలను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తయరు చేశారని దుయ్యబట్టారు. బయటికి వెళితే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చారని చెప్పారు.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వైసీపీ 100 సీట్లలో గెలుస్తుందని ఊకదంపుడు ప్రసారాలు చేసుకుంటోందని విమర్శించారు. దుర్మార్గంగా దాడులు జరుగుతున్నా సాక్షి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించిన చరిత్ర ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పారు.

రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో ఓటర్లకు తెలుసు, అందుకే వ్యయాన్ని లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుండి వచ్చి ఓట్లు వేశారని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలని వైసీపీ నేతలు దగ్గర ఉండి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడం పక్కా.. 135 సీట్లతో టీడీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కడపలో కూడా వైసీపీ ఓడిపోబోతుందని అన్నారు.

  • Loading...

More Telugu News