Pinnelli: పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం

Bombs In Ysrcp Leaders Houses
  • ఎన్నికల సందర్భంగా పిన్నెల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ
  • గ్రామస్థుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
  • వైసీపీ నేతల నివాసాలలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే, ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు నివ్వెరపోయారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను కనుక పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని తెలిపారు. 

మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామంలో గొడవలు పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచూ ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరిగాయి. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోవడడంతో టీడీపీ నేతలు పలువురు గ్రామంలో ఉండలేక హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించాక టీడీపీ నేతలు గ్రామానికి తిరిగి వచ్చారు.

  • Loading...

More Telugu News