Varanasi: నవ్వాలా.. ఏడ్వాలా..?: యూపీ కమెడియన్ ఆవేదన

Comedian After Nomination Rejected From PM Modi Seat
  • మోదీపై పోటీకి నామినేషన్ వేస్తే తిరస్కరించిన అధికారులు
  • వారణాసి నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన 55 మంది..
  • అందులో 36 మందిని తిరస్కరించిన కలెక్టర్
  • ఇదేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన కమెడియన్

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్డీయే కూటమి నేతలు వెంటరాగా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చని పలువురు అభ్యర్థులు వారణాసి నుంచి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. అందులో వారణాసికి చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా ఉన్నారు. అయితే, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన పనికి ‘నవ్వాలో.. ఏడ్వాలో’ తెలియని పరిస్థితి ఎదురైందని రంగీలా వాపోతున్నాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తనతో పాటు మొత్తం 55 మంది వారణాసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకేరోజు నామినేషన్ దాఖలు చేయగా.. తన నామినేషన్ పత్రాలతో పాటు మొత్తం 36 మంది పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ తిరస్కరించారని ఆరోపించాడు. తన నామినేషన్ పత్రాల్లో ఏదో పొరపాటు దొర్లిందని, తన ప్రమాణపత్రం సరిగా లేదని కలెక్టర్ ఏవో కారణాలు చెప్పారన్నాడు. 

కలెక్టర్ ను కలవడానికి తన లాయర్లను కానీ, తన స్నేహితులను కానీ అనుమతించకుండా తనను మాత్రమే లోపలికి వెళ్లమన్నారని ఆరోపించారు. తన స్నేహితుడిని పోలీసులు కొట్టారని మండిపడ్డాడు. అంతకు ముందురోజు 27 నామినేషన్లు దాఖలైతే ఆ రోజు 32 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, ఈ పరిస్థితి చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదని రంగీలా విమర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారణాసి కలెక్టరేట్ కూడా స్పందించి, వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం లేకపోవడం వల్లే శ్యామ్ రంగీలా నామినేషన్ ను తిరస్కరించినట్లు కలెక్టర్ కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. శ్యామ్ రంగీలా సమక్షంలోనే ఆయన నామినేషన్ పత్రాలను స్క్రూటినీ చేశామని గుర్తుచేసింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడం, ప్రమాణపత్రం లేకపోవడంతో నామినేషన్ తిరస్కరించడం జరిగిందని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా కూడా శ్యామ్ కు తెలియజేశామని కలెక్టర్ కార్యాలయం వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News