KTR: రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?: కేటీఆర్ ప్రశ్న

KTR questions Rahul Gandhi about Mohabbat Ki Dukaan
  • అచ్చంపేటలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ
  • ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన ప్రవీణ్ కుమార్
  • దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరిక

'రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అచ్చంపేటలో బుధవారం బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను జత చేశారు. 'నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడిలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర చూడండి' అంటూ ఆర్ఎస్పీ తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్ కూడా తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని గెలిపించుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News