Kannappa: 'కన్నప్ప'లో ప్రభాస్ .. రెమ్యునరేషన్ హాట్ టాపిక్!

Kannappa movie update
  • ముగింపు దశలో ఉన్న 'కన్నప్ప' చిత్రీకరణ 
  • ప్రభాస్ సీన్స్ పై జరుగుతున్న షూటింగ్
  • రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్న ప్రభాస్ 
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా

ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ప్రస్తుతం ప్రభాస్ తాను గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ప్రభాస్ కి కొత్తగా కథలు చెప్పడానికి స్టార్ డైరెక్టర్లు .. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మేకర్స్ లైన్లో ఉన్నారు. అయినా ప్రభాస్ ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆ సినిమా పేరే 'కన్నప్ప'. మంచు విష్ణు హీరోగా ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. 

'కన్నప్ప' సినిమాను వివిధ భాషల్లో .. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఈ సినిమాలో ప్రభాస్ మెరవనున్నాడు. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంత? అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ కి తగినట్టుగా ఆయన ఎంత తీసుకుని ఉండొచ్చుననే చర్చలు నడుస్తున్నాయి. 

ఈ ఉహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అన్ని కోట్లు .. ఇన్ని కోట్లు అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ అసలు ఈ సినిమాలో చేసినందుకు పారితోషికం తీసుకోలేదని సమాచారం. కేవలం మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఇలా గెస్టు రోల్ చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. ప్రభాస్ ఎంత చిన్న రోల్ చేసినా అది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుందనే విషయంలో సందేహం లేదు. 

  • Loading...

More Telugu News