ap eapcet 2024: రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024

ap eapcet 2024 exams to commence from tomorrow
  • పరీక్ష రాయనున్న 3.61 లక్షల మంది విద్యార్థులు
  • రెండు సెషన్లలో జరగనున్న పరీక్షలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్టీయూ కాకినాడ

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం (మే 16) నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (ఏపీ ఈఏపీసెట్–2024) జరగనున్నాయి. గురు, శుక్రవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా మే 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది.

ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లను జేఎన్టీయూ కాకినాడ పూర్తి చేసింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఆన్ లైన్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం ఏపీలోని 47 సెంటర్లతోపాటు తెలంగాణలో మూడు సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 3,61,640 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ రాయనున్నారు. 

పరీక్షకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే విద్యార్థులు 0884 2359599, 2342499 నంబర్లకు కాల్ చేయాలని జేఎన్టీయూ కాకినాడ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు సూచించారు. 

నంధ్యాలలోని రెండు పరీక్ష కేంద్రాలను మార్చామని.. మార్చిన సెంటర్ల వివరాలతో కూడిన రివైజ్డ్ హాల్ టికెట్లను విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని జేఎన్టీయూ కాకినాడ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ ఏడాది ఈఏపీ సెట్‌ దరఖాస్తులు పెరిగాయి. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు లభిస్తాయి. డీమ్డ్ యూనివర్సిటీల్లో 25 శాతం కోటాను కూడా ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

  • Loading...

More Telugu News