stairway: ఆకాశంలో అర కిలోమీటర్ ఎత్తుకు నిప్పుల నిచ్చెన..! ఇదిగో వీడియో

Video Of Chinese Artist Flaming Stairway to Heaven Goes Viral
  • చైనాకు చెందిన టపాసుల కళాకారుడి అదృత సృష్టి
  • వైరల్ గా మారిన పదేళ్ల నాటి వీడియో
  • అతని జీవితంపై డాక్యుమెంటరీ రూపొందించిన నెట్ ఫ్లిక్స్

చైనాలో ఓ టపాసుల కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలడం చూసి అవాక్కవుతున్నారు. అంత ఎత్తు వరకు నిచ్చెన ఆకారం ఎలా ఏర్పడిందో తెలియక నోరెళ్లబెట్టారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. 

అయితే ఇది దాదాపు పదేళ్ల కిందటి వీడియో అని, దీని వెనక ఓ చిన్న ట్రిక్ ఉందని వైస్ అనే వెబ్ సైట్ తెలిపింది. మెట్ల ఆకారంలో ఏర్పాటు చేసిన రాగి తీగల చుట్టూ గన్ పౌడర్ ను నింపి మంట అంటించడంతో ఇలా అద్భుత దృశ్యం కనిపించిందని తెలిపింది. తాను కళాకారుడిగా మారాలని కలలుకన్న తన నానమ్మకు నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. 1,650 అడుగులు లేదా 502 మీటర్ల ఎత్తు వరకు ఈ నిచ్చెన మంట వ్యాపించిందని చెప్పింది. 

1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదని తెలిపింది. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన ఉగ్ర దాడుల కారణంగా చైనా ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పింది.

ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అతని జీవితంపై ఏకంగా డాక్యుమెంటరీని సైతం రూపొందించింది. కాయ్ గో క్వింగ్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తున్నారు.

  • Loading...

More Telugu News