Kannappa: మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు

All set for Manchu Vishnu Kannappa teaser launch
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్... కన్నప్ప
  • శరవేగంగా షూటింగ్ పనులు
  • మే 20న టీజర్ విడుదల
  • ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో టీజర్ రిలీజ్ చేస్తున్నామన్న మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి ప్రభాస్ కూడా అడుగుపెట్టారు. కాగా, కన్నప్ప నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. 

ప్రఖ్యాత కేన్స్ ఫిలిం పెస్టివల్ లో మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నప్ప టీజర్ ను లాంచ్ చేస్తున్నామని మంచు విష్ణు వెల్లడించారు. కన్నప్ప ప్రపంచంలోని విశేషాలను ఓ గ్లింప్స్ రూపంలో ప్రేక్షకులకు అందించడానికి ఉవ్విళ్లూరుతున్నామని తెలిపారు. 

అవా ఎంటర్టయిన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇందులో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News