Rain: కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

Rain delays KKR and Gujarat Titans match
  • అహ్మదాబాద్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × గుజరాత్ టైటాన్స్
  • వర్షం కారణంగా టాస్ ఆలస్యం
  • ఈ మ్యాచ్ రద్దయితే గుజరాత్ టైటాన్స్ ఇంటికే!

ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయింది. మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంతవరకు టాస్ వేయలేదు. వర్షం తగ్గినప్పటికీ, పిచ్ ను ఇంకా కవర్లతో కప్పి ఉంచారు. 

కాగా, ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్ జట్టు ఇప్పటిదాకా 12 మ్యాచ్ లు ఆడి 5  విజయాలు సాధించింది. ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశాలు సాంకేతికంగా ఎక్కడో మిణుకుమిణుకుమంటున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు కాస్తంత మెరుగవుతాయి. 

మరోవైపు, కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ బెర్తును ఎప్పుడో ఖరారు చేసుకుంది. ఆ జట్టు 12 మ్యాచ్ ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News