Nara Lokesh: రాష్ట్ర ప్రజల తెగువకు పాదాభివందనం!: నారా లోకేశ్

Nara Lokesh salutes AP Voters
  • ఏపీలో నేడు పోలింగ్
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
  • టీడీపీ నాయకత్వంలో ఆనందోత్సాహాలు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప్పెనలా తరలివచ్చారన్న నారా లోకేశ్

రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికార పార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అరాచక శక్తులకు ఎదురొడ్డి ఏపీ ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటరు దేవుళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని నారా లోకేశ్ వెల్లడించారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News