Shaheen Afridi: ఆఫ్ఘన్ అభిమానితో పాక్ స్టార్ పేస‌ర్ గొడ‌వ‌.. ఫ్యాన్‌ను స్టేడియం నుంచి వెళ్ల‌గొట్టిన సెక్యూరిటీ సిబ్బంది!

  • ఐర్లాండ్, పాక్ మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్‌లో ఘ‌ట‌న‌
  • అఫ్రిది డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానానికి వెళ్తున్న స‌మ‌యంలో నోరుపారేసుకున్న‌ ఆఫ్ఘన్ అభిమాని
  • ఆ ఫ్యాన్‌తో గొడ‌వ‌కు దిగిన షాహీన్ అఫ్రిది
Afghan fan ejected after misbehaving with Shaheen Afridi

పాకిస్థాన్ స్టార్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది ఆఫ్ఘన్ అభిమానితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. ఆదివారం ఐర్లాండ్, పాక్ మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అఫ్రిది డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానానికి వెళ్తున్న స‌మ‌యంలో ఆఫ్ఘన్‌కు చెందిన ఓ అభిమాని అస‌భ్య‌క‌ర‌మైన భాష‌తో ఏదో అన‌డంతో అఫ్రిది ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. దాంతో ఆ ఫ్యాన్‌తో గొడ‌వ‌కు దిగాడు. ఇది గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది అఫ్రిదిని సముదాయించారు. అనంత‌రం ఆ అభిమానిని స్టేడియం నుంచి బ‌య‌ట‌కు పంపించి వేయ‌డం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది అరుదైన ఘ‌న‌త నమోదు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కేవ‌లం 145 మ్యాచుల్లోనే అత‌డు ఈ మైల్‌స్టోన్‌ను చేరుకోవ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 194 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి 3 మ్యాచుల సిరీస్‌ను 1-1 తేడాతో స‌మం చేసింది.

  • Loading...

More Telugu News