Rahul Gandhi: ఇక త్వరగా పెళ్లి చేసుకోక తప్పేలా లేదు..: రాహుల్​ గాంధీ

Rahul gandhi said he will have to get married soon
  • రాయబరేలీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ
  • పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ జనం నుంచి ప్రశ్న 
  • నవ్వుతూ ఇక త్వరలో చేసుకోక తప్పదంటూ రాహుల్ వ్యాఖ్య

రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించారు. జనం దీనిని ప్రస్తావించగా.. ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని పేర్కొన్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

తల్లి స్థానంలో రాహుల్ పోటీ..
ఇప్పటికే కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ గాంధీ.. ఐదో దశలో ఎన్నిక జరగనున్న రాయబరేలీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇది చాలా ఏళ్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం విశేషం. ఇప్పుడు అక్కడ రాహుల్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రియాంక గాంధీతో కలసి ఆయన రాయబరేలీలో ఎన్నికల ప్రచారం చేశారు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే నినాదాలతో..

  • రాయబరేలీ సభలో బీజేపీ పార్టీ, ఎన్డీయే సర్కారు విధానాలపై రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రాయబరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఇందిరాగాంధీ, ఇటీవలి వరకు సోనియాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ఇది తమకు కర్మ భూమి అని పేర్కొన్నారు.
  • ఈ క్రమంలోనే సభకు హాజరైన కొందరు జనం.. రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ ప్రశ్నించారు. అప్పటిదాకా సీరియస్ గా సాగిన ప్రసంగాన్ని ముగిస్తూ.. రాహుల్ దీనిపై స్పందించారు.
  • ‘‘ఇప్పుడిక నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు (అబ్ జల్దీ హి కర్నీ పడేగీ) ” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ కూడా నవ్వుతూ కనిపించారు.

  • Loading...

More Telugu News