cat: బోనులో పెట్టడమెలాగో కుక్కకు నేర్పిస్తే.. పిల్లిని ఇరికించేసింది.. సరదా వీడియో ఇదిగో!

man teaches dog how to close cage dog catches cat in it
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఏకంగా 32 మిలియన్ల వ్యూస్.. 16 లక్షలకుపైగా లైకులు
  • శునకం బాగా తెలివి చూపించిందే అంటూ కామెంట్లు

శునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అంటుంటారు. మనం కాస్త బాగా చూసుకుంటే చాలు.. మనం ఏ చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపించడమే కాదు.. వామ్మో నేర్చుకున్న తెలివిని ఇంకాస్త తెలివిగా ఉపయోగించేస్తోందే అని ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇంతకీ ఆ శునకానికి ఏం నేర్పారు, అదేం చేసిందంటే..

  • ఓ చిన్న పాటి బోను. దానికి చిన్న తాడు సాయంతో లాక్ వేసేలా తయారు చేశారు. ఓ శునకం యజమానికి దానికి ఆ తాడు వద్ద గట్టిగా నొక్కి.. బోను లాక్ చేయగలిగేలా శిక్షణ ఇచ్చాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఆ శునకం చేసిన పని మాత్రం ఆశ్చర్యకరమే.
  • అదే ఇంట్లో ఓ పెంపుడు పిల్లి కూడా ఉంది. ఆ పిల్లిని ఓ ఆటాడుకోవాలని శునకం భావించింది. ఆ పిల్లి ఆడుకునే చిన్న బొమ్మను పట్టుకెళ్లి.. బోను లోపల పెట్టి.. వెళ్లిపోయింది.
  • దీన్ని గమనించిన పిల్లి బోను లోపలికి వెళ్లింది. వెంటనే శునకం పరుగెత్తుకొచ్చింది. పిల్లిని బోను లోపలే పెట్టి లాక్ వేసేసి.. వెళ్లిపోయింది.
  • ఆ పెంపుడు శునకం ‘రూబీ’ పేరిటే ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేయగా.. వైరల్ గా మారింది. విపరీతమైన సరదా కామెంట్లు వస్తున్నాయి.
  • ‘అబ్బా కుక్క చేతిలో మళ్లీ మోసపోయానా.. అని పిల్లి తలపట్టుకున్నట్టే..’ అంటూ కొందరు.. ‘పిల్లి దీనికి బదులు తీర్చుకుంటుందని..’ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
  • ఇంతకీ ఈ వీడియోకు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా..? ఏకంగా 32 మిలియన్ల వ్యూస్.. 16 లక్షలకుపైగా లైకులు వచ్చాయి.

View this post on Instagram

A post shared by Ruby Nance (@_ruby.the.labrador_)

  • Loading...

More Telugu News