Elections 2024: ఏపీ, తెలంగాణ‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం ఇలా..!

  • ఏపీలో 36 శాతం, తెలంగాణ‌లో 40 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఈసీ వెల్ల‌డి
  • ఏపీలో ఉదయం 11 గంటలకు 23.10 శాతం పోలింగ్ 
  • ఆ త‌ర్వాత‌ మరో రెండు గంటల్లోనే 36 శాతానికి చేరిన వైనం
  • ఈసారి ఏపీలో 83 శాతం పోలింగ్ జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని ఈసీ అంచనా
The polling percentages in AP and Telangana till 1 pm

మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ, తెలంగాణ‌లో న‌మోదైన‌ పోలింగ్ శాతాన్ని ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఏపీలో 36 శాతం, తెలంగాణ‌లో 40 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఈసీ తెలిపింది. ఇక ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం గంట గంటకు పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒకటి వరకు 36 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. తొలి మూడు గంటలు మందకొడిగా సాగిన‌ పోలింగ్‌ ఉదయం 11 గంటల త‌ర్వాత‌ పుంజుకుంది.

ఏపీలో ఉదయం 11 గంటలకు 23.10 శాతం పోలింగ్ న‌మోదు కాగా, ఆ త‌ర్వాత‌ మరో రెండు గంటల్లోనే 36 శాతానికి చేరింది. చాలా చోట్ల భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓట‌ర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. నరసరావుపేటలో 27.14, గురజాలలో 24.31, సత్తెనపల్లిలో 23.63, వినుకొండలో 24.83 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈసారి 83 శాతం పోలింగ్ జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని ఈసీ అంచనా వేసింది. ఎన్నిక‌ల అధికారి ముకేశ్‌కుమార్ మీనా కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

  • Loading...

More Telugu News