Junior NTR: ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్

Junior NTR and Allu Arjun voted in Hyderabad
  • ఉదయాన్నే ఓటు వేసిన పాన్ ఇండియా స్టార్లు
  • వీలైనంత త్వరగా ఓటు వేసేందుకు మొగ్గుచూపుతున్న సినీ సెలబ్రెటీలు
  • ఏపీలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్న ఓటర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్ని ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లితో కలిసి వెళ్లి ఓటు వేశారు. క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే తన ఓటు వేశారు. హైదరాబాద్ సిటీలో తనకు కేటాయించిన పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్‌లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News