Chandrababu: టీడీపీ వార్ రూమ్ లో చంద్రబాబు... రేపటి పోలింగ్ పై సమీక్ష

Chandrababu reviews on polling issues
  • ఏపీలో రేపు ఎన్నికలు
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
  • నేడు వార్ రూమ్ నుంచి జిల్లాలు, నియోజకవర్గాల నేతలకు దిశానిర్దేశం
  • గ్రామ స్థాయి పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మానిటరింగ్
  • ప్రతి అంశాన్ని కవర్ చేసేలా ఏర్పాట్లు

టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి పోలింగ్ పై దృష్టి పెట్టారు. ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయంలో వార్ రూమ్ కు చేరుకున్న ఆయన, జిల్లాలు, నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. 

రేపు పోలింగ్ పై తీసుకోవాల్సిన చర్యలపై అటు పార్టీ నేతలకు, ఇటు వార్ రూమ్ బృందానికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ వేళ అనేక అంశాలను సమన్వయం చేసేందుకు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి, కొందరికి బాధ్యతలు అప్పగించారు. 

గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. నియోజవకర్గాల్లో పోలింగ్ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రధాన వార్ రూమ్ కు సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News