Nagababu: జనసేనాని చిందించిన ప్రతీ చెమట బొట్టు.. భావి తరాలకు మార్గదర్శపు మెట్టు: నాగబాబు

  • సోదరుడిపై కవితాత్మకంగా ట్వీట్ చేసిన నాగబాబు
  • నమ్మని వాళ్ల కోసం, కలిసి నడవని వారి కోసం కూడా పవన్ కల్యాణ్ కష్టపడుతున్నాడని ప్రశంస
  • సామాన్యుడి వేలి సంతకంతో జనసేనాని గెలుపు సిద్ధమైందంటూ వ్యాఖ్య
Mega Hero Nagababu Tweet About His Brother Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ పై ఆయన సోదరుడు, మెగా హీరో నాగబాబు కవితాత్మకంగా ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ తనను నమ్మిన వారి కోసమే కాకుండా నమ్మని వారి కోసం కూడా తపన పడుతున్నాడని చెప్పుకొచ్చారు. తన వెంట నడుస్తున్న వారితో పాటు తనకు దూరంగా ఉండే వాళ్ల గురించి కూడా ఆలోచిస్తున్నాడని సోదరుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈమేరకు ఆదివారం సోదరుడితో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. ఇప్పుడిప్పుడే పవన్ ఆలోచనల్లోని విశాలతను అర్థం చేసుకోవడం మొదలు పెట్టినట్లు చెప్పారు.

‘నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టుని చూపిస్తాడు. అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.. నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు. తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడపుతుందని.. అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను. సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది. విజయీభవ..!’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News