Lok Sabha Polls: ఖమ్మంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్

Flag March conducted by police in Khammam
  • ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఫ్లాగ్ మార్చ్
  • శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలన్న అడిషనల్ డీసీపీ 
  • నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా నిర్వహించినట్లు వెల్లడి

తెలంగాణలోని ఖమ్మం నగరంలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని... ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు దీనిని నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్‌పై ఖమ్మం అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు మాట్లాడుతూ... నగరంలో కేంద్ర పోలీసు బలగాలతో నిర్వహించినట్లు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోను కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
బాటసింగారం, అనాజ్‌పూర్, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో రాచకొండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మెదక్ జిల్లాలోని జగదేవ్ పూర్‌లో, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని వెంకట్రావుపేట, తొగుట, ఘనపూర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

  • Loading...

More Telugu News