KTR: 'మోదీ గ్యారెంటీ' అనే బీజేపీ నినాదం న‌వ్వు తెప్పిస్తోంది.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

KTR Tweet on PM Modi given Guarantees in 2014
  • 2014లో మోదీ ఇచ్చిన హామీలు నెర‌వేరాయా? అంటూ ప్ర‌శ్నించిన‌ కేటీఆర్ 
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేశారా?
  • యువ‌త‌కు యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
  • న‌ల్ల ధ‌నాన్ని వెన‌క్కి తెచ్చి ప్ర‌తి ఇంటికీ రూ. 15 ల‌క్ష‌లు ఇచ్చారా?
  • మోదీ జీ.. మీ గ్యారెంటీ ఏమ‌య్యిందో దేశం తెలుసుకోవాల‌నుకుంటోందంటూ కేటీఆర్ ట్వీట్‌

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామ‌రావు ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి బీజేపీకి చుర‌కలంటించారు. 2014లో మోదీ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ ఒక ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.  'మోదీ గ్యారెంటీ' అనే బీజేపీ నినాదం న‌వ్వు తెప్పిస్తోందని కేటీఆర్ అన్నారు. 2014లో ఆయ‌న ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చారా అని ప్ర‌శ్నించారు. 

"2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? యువ‌త‌కు యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? 2022 నాటికి దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను రెట్టింపు చేసి 5 ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేర్చారా? బుల్లెట్ రైళ్లు తీసుకొచ్చారా? ప్రతి ఇంటికి తాగునీరు, క‌రెంట్‌, టాయిలెట్ ఇచ్చారా? న‌ల్ల ధ‌నాన్ని వెన‌క్కి తెచ్చి ప్ర‌తి ఇంటికీ రూ. 15 ల‌క్ష‌లు ఇచ్చారా? మోదీ జీ మీ గ్యారెంటీ ఏమ‌య్యిందో దేశం తెలుసుకోవాల‌నుకుంటోంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News