Priyanka Gandhi: మోదీని 'నాటు నాటు' చేయనీయండి... మీ వద్ద 'ఆర్ఆర్ఆర్' ఉన్నారు: రేవంత్ రెడ్డిని చూపిస్తూ ప్రియాంకగాంధీ ప్రసంగం

Priyanka Gandhi compares RRR with Revanth Reddy and Rahul Gandhi
  • ఆర్ఆర్ఆర్ సినిమాను చూశారా? అని ప్రశ్నించిన ప్రియాంకగాంధీ
  • మోదీని, ఆయన మంత్రులను నాటు నాటు చేయనీయండని వ్యాఖ్య
  • కానీ మీ వద్ద ఆర్ఆర్ఆర్ రూపంలో సమర్థవంతమైన నాయకత్వముందని కితాబు

ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రస్తావించారు. 'రేవంత్' 'రెడ్డి', 'రాహుల్' గాంధీ రూపంలో మీకు ఆర్ఆర్ఆర్ ఉందని... తెలంగాణ అన్ని  రంగాల్లో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని చూపిస్తూ 'ఆర్ఆర్' మీ వద్ద ఉందని కితాబునిచ్చారు.

'ఆర్ఆర్ఆర్ సినిమాను చూశారా? అది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సినిమా. మోదీగారిని, ఆయన మంత్రులందరినీ నాటు నాటు (డ్యాన్స్) చేయనీయండి. కానీ మీ వద్ద రేవంత్ రెడ్డి ఉన్నారు అంటే 'ఆర్' 'ఆర్'... అలాగే రాహుల్ గాంధీ అంటే 'ఆర్'... 'ఆర్ఆర్ఆర్' ఉన్నారు. రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాన'ని పేర్కొన్నారు.
   

  • Loading...

More Telugu News