Gautam Gambhir: గంభీర్‌కు అభిమాని రిక్వెస్ట్‌.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆ ప‌ని చేయొద్ద‌ని ఎమోష‌న‌ల్.. వీడియో వైర‌ల్!

  • ముంబైతో మ్యాచ్‌కు ముందు మెంటార్ గౌతం గంభీర్‌తో కేకేఆర్‌ ఫ్యాన్ మీట్ 
  • 2018లో కేకేఆర్‌ను వ‌దిలి పెట్టి వేరే ఫ్రాంచైజీకి వెళ్లిన గౌతం గంభీర్‌
  • ఈ ఏడాది తిరిగి కోల్‌క‌తా జ‌ట్టుతో చేరిన విష‌యాన్ని గుర్తు చేస్తూ ఎమోష‌న‌ల్ అయిన అభిమాని 
  • ఎట్టిప‌రిస్థితిలో మ‌ళ్లీ కేకేఆర్ ఫ్రాంచైజీని వ‌దిలి పెట్టొద‌ని గౌతీతో ఫ్యాన్‌ మొర
Emotional KKR Fan Breaks Down After Meeting Gautam Gambhir

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తోంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచులాడిన కోల్‌క‌తా 8 విజ‌యాలు సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉంది. ఇక త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో ముంబైతో ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు మెంటార్ గౌతం గంభీర్‌తో ఫ్యాన్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఓ అభిమాని గంభీర్‌తో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. గౌతీ 2018లో కేకేఆర్‌ను వ‌దిలి పెట్టి వెళ్లిన త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఏడాది తిరిగి అదే ఫ్రాంచైజీతో క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఆ అభిమాని గంభీర్‌కు ఓ రిక్వెస్ట్ చేశాడు. 

"గౌతీ భ‌య్యా.. మేము నిన్ను కోరుకునేది ఒక్క‌టే. నువ్వు ఎప్ప‌టికీ మ‌మ్మ‌ల్ని వ‌దిలి పెట్టి వెళ్లొద్దు. గ‌తంలో మీరు కోల్‌క‌తాను వదిలి వెళ్లిన‌ప్పుడు మా గుండె ప‌గిలింది. ఆ బాధ‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. మీ కోసం ఓ బెంగాలీ పాట‌ను అంకితం చేద్దామ‌నుకుంటున్నా. మిమ్మ‌ల్ని ఎల్ల‌వేళ‌లా మా ప‌క్క‌నే ఉంచుకుంటాం. ఎప్ప‌టికీ మ‌మ్మ‌ల్ని వ‌దిలిపెట్టొద్దు. మీరు మా హృద‌యం. ప్లీజ్ స‌ర్"  అంటూ ఆ అభిమాని కోరారు. ఆ ఫ్యాన్ మాట‌ల‌కు గౌతం గంభీర్ చిరున‌వ్వుతో స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియోను కేకేఆర్ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

  • Loading...

More Telugu News