Mukku Avinash: ఒక మంచి ఛాన్స్ రావడానికి ఏడేళ్లు పట్టింది: ముక్కు అవినాశ్

Mukku Avinash Interview
  • క్రేజ్ తెచ్చిన జబర్దస్త్ కామెడీ షో 
  • చమ్మక్ చంద్ర హెల్ప్ చేశాడని వివరణ 
  • బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వెల్లడి

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో ముక్కు అవినాశ్ ఒకరు. ప్రస్తుతం తాను కామెడీ షోస్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా 'ట్రీ మీడియా' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాశ్ మాట్లాడుతూ .. "మేము ఐదుగురం అన్నదమ్ములం .. నేను ఇంకా సెటిల్ కాలేదు. మంచి పాత్రలు రావాలనీ .. నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.

"నేను బీటెక్ చదివాను .. నటన వైపుకు రావాలనుకుంటే మా నాన్న వద్దని చెప్పాడు. ఇక్కడ అందరూ నిలబడలేరని అన్నాడు. ఆయనకి నచ్చజెప్పి ఇటువైపు వచ్చాను. ఒక సినిమా ఒప్పుకుంటే అది మధ్యలో ఆగిపోయింది. ఫస్టు టైమ్ ఒక స్కిట్ చేస్తే అది ఎడిటింగ్ లో పోయింది. అలా ఒక మంచి ఛాన్స్ రావడానికి నాకు ఏడేళ్లు పట్టింది" అని అన్నాడు. 

 " ఒక వైపున సినిమాలలో చేస్తుండగా టీవీల్లో అవకాశం వచ్చింది. నేను మిమిక్రీ చేస్తాను గనుక, టీవీ షోస్ కి నన్ను పిలిచేవారు. ఆ తరువాత ఒక వైపున చమ్మక్ చంద్ర .. మరో వైపున బలగం వేణు నాకు 'జబర్దస్త్' లో అవకాశం ఇచ్చారు. అక్కడ వచ్చిన గుర్తింపు నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పాడు.

  • Loading...

More Telugu News