Nara Lokesh: కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు!: నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Lokesh sensational allegations ahead of pollig
  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం
  • ఆత్మకూరులో రచ్చబండ కార్యక్రమం
  • ఓటుకు పదివేలు ఇస్తారన్న సమాచారం ఉందని లోకేశ్ వెల్లడి
  • డబ్బు ఇస్తే తీసుకుని, ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఇవాళ కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్... కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు. 

"గత ఐదేళ్లుగా ఒక్కో ఓటరు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచుకున్న జగన్... ఇప్పుడు ఖర్చు చేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే... తీసుకోండి... ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మాకు వేయండి. 

మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. 

ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News