Ram Charan: రేపు పిఠాపురం వస్తున్న రామ్ చరణ్, కొణిదెల సురేఖ

Ram Charan and Konidela Surekha will come Pithapuram tomorrow
  • శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి చేరిక
  • అక్కడ్నించి పిఠాపురం వెళ్లనున్న రామ్ చరణ్, సురేఖ
  • శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్న వైనం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన మాతృమూర్తి కొణిదెల సురేఖ రేపు పిఠాపురం వస్తున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న రామ్ చరణ్, సురేఖ అక్కడ్నించి పిఠాపురం వెళ్లనున్నారు. ఇక్కడి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కుక్కటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారు జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News